Share News

Story : సాయం చేయడం మంచిదే

ABN , Publish Date - Oct 03 , 2024 | 11:58 PM

ఒక గురువు గారి దగ్గర అజయుడు, విజయుడు అనే ఇద్దరు రాకుమారులు విద్యాభ్యాసం చేసేవారు. వారిద్దరి విద్య పూర్తి అయే సమయానికి, వారి గురువుగారు వారిద్దరినీ దగ్గరికి పిలిచి, ఇలా చెప్పారు ‘నాయనా మీ ఇద్దరి విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది,

Story : సాయం చేయడం మంచిదే

ఒక గురువు గారి దగ్గర అజయుడు, విజయుడు అనే ఇద్దరు రాకుమారులు విద్యాభ్యాసం చేసేవారు. వారిద్దరి విద్య పూర్తి అయే సమయానికి, వారి గురువుగారు వారిద్దరినీ దగ్గరికి పిలిచి, ఇలా చెప్పారు ‘నాయనా మీ ఇద్దరి విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది, ఇపుడునేను మీకు ఓ పరీక్ష పెట్టదలిచాను. ఇక్కడికి దూరంగా ఉన్న ఆటవికుల గుహలలో ఒక విలువైన రత్నంఉంది వారిదగ్గరకు వెళ్లి, ఎవరైతే ఆ రత్నాన్ని మందుగా తెచ్చి, నాకు ఇస్తారో వారే విజేతగా ప్రకటించబడతారు’ అన్నాడు, ఆ తరువాత ఇద్దరూ తమతమ గుర్రాలను తీసుకుని, ఆ ఆటవికుల గుహల వైపుగా ప్రయాణం సాగించారు. వారికి దారిలో ఒళ్లంతా గాయాలతో రక్తం ఓడుతూ నీరసంగా పడిపోయిఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అజయుడు ఇతని గోలమనకు ఎందుకు విజయా మన దారిన మనం పోదాం పద అంటూ ముందుకు సాగిసోయాడు. విజయుడు మాత్రం అక్కడే ఆగి,ఆ గాయపడిన మనిషికి సాయం చేసి, నీళ్లు తాగించి, ఆ తరువాతే గుహల వద్దకు ప్రయాణమయ్యాడు. విజయుడు అక్కడికి చేరేసరికే అజయుడు ఆ ఆటవికుల దగ్గరకు చేరి ఉన్నాడు. ఆలస్యంగా చేరుకున్న మిత్రునిచూసి అజయుడు ఇలా అన్నాడు ఎందుకు అందరికీ సాయం చేయాలనే కోరిక వల్ల నీ సమయం ఇలా వృధా చేసుకుంటావు? చూడు ఎంత ఆలస్యంగా చేరుకున్నావో? అన్నాడు దానికి విజయుడు ఇలా జవాబు చెప్పాడు. ‘అతను ఎవరోకాదు ఈ ఆటవికుల చేతిలో గాయపడిన వాడే అతనితో నేను కాసేపు ఉండటం వలనే వీరితోఎలా మాట్లాడాలి వీరు ఎటువంటి వారు ఆ అమూల్యమైన రత్నాన్ని సాధించాలంటే ఏం చేయాలి వంటి విషయాలన్నీ అతనే నాకు చెప్పి పంపాడు.


నేను సాటి మనిషి ఆపదలో ఉన్నాడని ఆదుకోవాలి అనుకున్నాను. కానీ అక్కడ కూడా మనకు మేలే జరిగింది చూడు’ అన్నాడు ఈ మాటలు విన్న అజయుడు విజయుడికంటే ముందుగా ఆటవికుల వద్దకు వెళ్లి, రత్నం కోసం ప్రయత్నం చేసాడు దొరికిన రత్నాన్ని తీసుకుని, అజయుడు ముందుగా ఆశ్రమానికి చేరుకుని ‘ గురుదేవా,,ఇదిగో మీరు అడిగిన అమూల్యమైన రత్నం నేను ముందుగా వచ్చాను కాబట్టి, నన్ను విజేతగా ప్రకటించండి అన్నాడు. దానికి గురువుగారు నవ్వి, ‘నువ్వు ముందుగా చేరుకున్నది నిజమే కానీ దారిలో గాయాలతో పడి ఉన్న సాటి మనిషిని అశ్రధ్ద చేసి ముందుకు సాగిపోయావు అలాగే ఆటవికుల గురించి,రత్నం గురించి విలువైన సమాచారం సేకరించి నీకు చెప్పినది నీమిత్రుడు విజయుడు. వాస్తవానికి రత్నం అతనే తీసుకుని రావాలి. నువ్వు పందెంలో గెలిచి తీరాలనే ఉత్సాహంతో మానవతను, మిత్రఽ దర్మాన్ని కూడా విస్మరించావు, మంచి పాలకుడివి కావాలి అంటే ముందు మంచి మనిషివి కావాలి అది తెలుసుకో అని చెప్పి, ఆలస్యంగా వచ్చినా సరే అని విజయుడిని ఆ పోటీలో విజేతగా ప్రకటించాడు.

Updated Date - Oct 03 , 2024 | 11:58 PM