Share News

Littles : సోమరి సుబ్బయ్య

ABN , Publish Date - Oct 09 , 2024 | 06:05 AM

అనంత వరం అనే ఊరికి కూతవేటు దూరంలో ఒక అడవి ఉంది. ఈ గ్రామ ప్రజలు పళ్లు కాయలు అవసరమైన వంట చెరకు కోసం హాయిగా అడవికి నడిచి పోయి అన్నీ తెచ్చుకునే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అడవికి వెళ్లి, అక్కడే చెట్ల నీడలో ఆడుకొని, ఆ చెట్ల తియ్యనిపండ్లను కోసుకుని వచ్చేవారు.

Littles : సోమరి సుబ్బయ్య

Littles: అనంత వరం అనే ఊరికి కూతవేటు దూరంలో ఒక అడవి ఉంది. ఈ గ్రామ ప్రజలు పళ్లు కాయలు అవసరమైన వంట చెరకు కోసం హాయిగా అడవికి నడిచి పోయి అన్నీ తెచ్చుకునే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అడవికి వెళ్లి, అక్కడే చెట్ల నీడలో ఆడుకొని, ఆ చెట్ల తియ్యనిపండ్లను కోసుకుని వచ్చేవారు. ఒక రోజు చందుఅనే పిల్లవాడు రేగు పండ్ల కోసం అడవికి వెళ్లి, కాసేపు పండ్లు కోసుకున్న తర్వాత ఆ ఎండకు తట్టుకోలేక ఆ చెట్టు నీడలో సొమ్మసిల్లిపడి పోయి అలాగే నిద్ర పోయాడు. పక్కనున్న చెట్ల మీద కూర్చున్న కొన్ని కోతులు చందు ఇబ్బంది చూసి సాయం చేయాలి అనుకున్నాయి, ఆ కోతుల్లో పెద్ద కోతులు చెట్ల కొమ్మలను బలంగా ఊపితే, చిన్న కోతులు పండ్లను కోసి, చందు సంచీలో వేసాయి.

మెలకువ వచ్చాక చుట్టూ చూసుకున్న చందూకి, తన చుట్టూ రాలిపడిన చాలాపండ్లు, ఇంకా తన సంచీ నిండా తియ్యని మంచి పండ్లు కనిపించాయి, చెట్టు కొమ్మలమీద చూస్తే, కనిపించిన కోతులను చూసి అవే తనకు సాయం చేసి ఉంటాయని గ్రహించాడు చందు. సంతోషంగా ఆ పండ్ల సంచీని తీసుకుని ఇంటికి వెళ్లి, జరిగినదంతా ఇంట్లో వారితో చెప్పాడు.


అందరూ అది విని ఆశ్చర్య పోతే, చందు మేనమామ సుబ్బయ్య మాత్రం తాను కూడా అడవికి వెళ్లి అలాగే పండ్లు సంపాదించాలి అని పథకం వేసుకున్నాడు, ఆ మర్నాడు సుబ్బయ్య మధ్యాహ్నం పూట ఎండగా ఉన్నపుడు అడవికి బయలుదేరి, ఆ చెట్టు దగ్గరికి వెళ్లి, సంచీ పక్కన పడేసి,ఆ నీడలో పడి నిద్రపోయాడు కోతులు వచ్చితనకు సాయం చేస్తాయో లేదో అని నిద్ర నటిస్తూ, గమనిస్తూ ఉన్నాడు.

కాసేపటికి, చెట్టుకింద ఎవరో పడుకొని ఉన్న విషయం గమనించిన కోతులు సుబ్బయ్య దగ్గరికి వచ్చి చూసి, అతను నిద్ర నటిస్తున్న విషయం అర్ధం చేసుకునొ పండ్లు కోసి సాయం చేయడం మానేసి, అతని మీద దూకి, తమ గోర్లతో రక్కి గాయ పరిచాయి. ఆ గాయాలతో ఇంటికి వెళ్లిన సుబ్బయ్య ‘అనవసరంగా దురాశ కి పోయి సోమరితనంతో శ్రమ లేకుండా పండ్లు సంపాదించాలని పోయి, గాయాల పాలయ్యాను కదా’ అని విచారించాడు.

Updated Date - Oct 09 , 2024 | 06:05 AM