ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andole: కనులపండువగా అందోల్ రంగనాథుడి బ్రహ్మోత్సవాలు.. పోటెత్తుతున్న భక్తులు

ABN, Publish Date - May 30 , 2024 | 10:47 AM

సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండల కేంద్రంలో శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఆలయానికి నూతన రథం చేయించిన మంత్రి దామోదర ఇప్పటికే రెండుసార్లు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.

1/11

సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండల కేంద్రంలో శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి.

2/11

ఆలయానికి నూతన రథం చేయించిన మంత్రి దామోదర ఇప్పటికే రెండుసార్లు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.

3/11

దామోదర రాజనర్సింహ చొరవతో 1992లో రంగనాథ ఆలయం నుంచి నాచారంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చెంతకు తరలించిన పంచలోహ విగ్రహాలను తిరిగి రంగనాథుడి చెంతకు చేర్చారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.

4/11

బ్రహోత్మవాల్లో భాగంగా ఆలయంలో శాంతి పాఠం, యాగశాల ప్రవేశం, గరుడ హోమం, ధ్వజారోహణం, డోలోత్సవం, దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

5/11

వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో నాగేంద్రుడిపైన శయన భంగిమలో కొలువుదీరిన స్వామి భక్తవత్సలుడిగా విరాజిల్లుతున్నాడు. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో కల్పగూరును పాలించిన రాజు శౌర్యరామినేడు కట్టాడట. శ్రీరంగం నుంచి రంగనాథస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించాడట. తరువాత రాణి శంకరమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసింది.

6/11

మే 31న జరిగే రథోత్సవంతో బ్రహోత్సవ వేడుకలు ముగియనుండటంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అందోల్ పట్టణమంతా రంగనాథుడి నామస్మరణతో మార్మోగుతోంది.

7/11

పూజ కార్యక్రమాల్లో భాగంగా హాజరైన భక్తులు

8/11

రంగనాథ స్వామి వారి పూజల్లో పాల్గొన్న మంత్రి దామోదర కుమార్తె త్రిష ఆమె భర్త మణికంఠ.

9/11

రంగనాథ స్వామి వారి సేవలో అర్చకులు, భక్తులు

10/11

మంత్రి చొరవతో 30 ఏళ్ల తరువాత అందోల్ రంగనాథుడి చెంతకు చేరుకున్న ఉత్సవ విగ్రహాలు ఇవే..

11/11

మంత్రి దామోదర రాజనరసింహా చేయించిన రథం ఇదే. మే 25న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందోల్ పట్టణంలోని వీధుల్లో మే 31న రథ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది.

Updated Date - May 30 , 2024 | 12:14 PM

Advertising
Advertising