తక్కువగా నిద్రపోతే చర్మం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?
ABN, Publish Date - Sep 14 , 2024 | 11:44 AM
మంచి నిద్ర శరీరానికి చాలా ముఖ్యం అని అంటూ ఉంటారు. రోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం అవసరం.

నిద్ర లేకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి వినే ఉంటారు. కానీ నిద్ర లేకపోవడం వల్ల చర్మం మీద కూడా ప్రభావం ఉంటుంది.

నిద్ర సరిగా లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కళ్ల కింద చర్మం ఉబ్బుతుంది.

నిద్ర తగినంత లేకపోతే చర్మంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీని కారణంగా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.

నిద్ర సరిగా లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఇది చర్మంలో ముడతలకు కారణం అవుతుంది.

చాలా మందిలో నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఇవి మొటిమలకు కారణం అవుతాయి.

నిద్ర తక్కువైతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల చర్మం పొడిబారుతుంది.
Updated at - Sep 14 , 2024 | 11:44 AM