రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:36 AM
సికింద్రాబాద్‌లో ఎక్కాల్సిన రైలు చర్లపల్లి టెర్మినల్ నుంచి బయల్దేరుతుందంటూ మొబైల్ ఫోన్లకు వస్తున్న మేసేజ్‌లతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

రేపటి నుంచి పలు రైళ్ల మళ్లింపు
సికింద్రాబాద్ బదులు చర్లపల్లి టెర్మినల్
పొంతనలేని సమాచారంతో గందరగోళం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లో ఎక్కాల్సిన రైలు చర్లపల్లి టెర్మినల్ నుంచి బయల్దేరుతుందంటూ మొబైల్ ఫోన్లకు వస్తున్న మేసేజ్‌లతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మేసేజ్‌లు చూసుకోకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి పరేషాన్ అవుతున్నారు. చివరి నిమిషంలో స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు చర్లపల్లి టర్మినల్‌కు వెళ్లడానికి వీలుకాక ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో పనులకు ఆటంకం కలుగకుండా ముఖ్యమైన రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రారంభిస్తున్నారు.
స్పష్టత లేని ఎస్‌ఎంఎ్‌సలతో గందరగోళం
ఈ నెల 13నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయల్దేరే టెర్మినళ్లను మార్పు చేసిన విషయమై దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారులు ఇచ్చిన సమాచారానికి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సీఆర్‌ఐఎస్) నుంచి ప్రయాణికులకు అందుతున్న సమాచారానికి పొంతన లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఏ రైలు ఎప్పుడు, ఎక్కడ్నుంచి బయల్దేరుతుంది, ఏఏ స్టేషన్లలో ఆగుతుందనే అంశాలపై ప్రయాణికులకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తరుచుగా విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికుల మొబైల్స్‌కు కేవలం సంక్షిప్త సందేశాలను పంపి సీఆర్‌ఐఎస్ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారని సమాచారం.
సికింద్రాబాద్ బదులు చర్లపల్లి నుంచి వెళ్లే రైళ్లు ఇవే!
13వ తేదీ నుంచి సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే గరీబ్‌రథ్ (12735/12736)ఎక్స్‌ప్రెస్
15వ తేదీ నుంచి సికింద్రాబాద్- రేపల్లె మధ్య నడిచే(17645/17646)రేపల్లె ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-మణుగూరు(12745/12746)ఎక్స్‌ప్రెస్
22వ తేదీ నుంచి విశాఖపట్నం-ముంబై-విశాఖపట్నం(20809/20810)ఎక్స్‌ప్రెస్
23వ తేదీ నుంచి కాకినాడ- షిర్డీ-కాకినాడ ట్రైవీక్లీ(17205/17206)ఎక్స్‌ప్రెస్
24వ తేదీ నుంచి విశాఖపట్నం-సాయినగర్ షిర్డీ-విశాఖపట్నం వీక్లీ(18503/18504)ఎక్స్‌ప్రెస్
25వ తేదీ నుంచి లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్-నాగర్‌సోల్-నర్సాపూర్(12787/12788)ఎక్స్‌ప్రెస్,
నగరంలోని ఇతర స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లు ఇవీ!
14వ తేదీ నుంచి సిద్దిపేట వెళ్లే రెండు డెమో రైళ్లు మల్కాజిగిరి స్టేషన్ నుంచి
15వ తేదీ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి
16వ తేదీ నుంచి పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు బదులుగా ఉమ్డానగర్ నుంచి
16వ తేదీ నుంచి సికింద్రాబాద్-పుణె ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ టెర్మినల్ నుంచి
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు