Yanamala Ramakrishna: యనమల రామకృష్ణుడు రాజకీయ ప్రస్థానంపై పుస్తకం ఆవిష్కరణ
ABN, Publish Date - Apr 11 , 2025 | 10:29 AM
యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితంపై ‘42వ వసంతాల యనమల రాజకీయ ప్రస్థానం’ పేరుతో పుస్తకం ప్రచురించారు. కాకినాడ జిల్లా తునిలో ఈ పుస్తకావిష్కరణ, ఆత్మీయ సన్మాన వేడుకను గురువారం నాడు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, నారాయణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు , కూటమి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.

యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితంపై ‘42వ వసంతాల యనమల రాజకీయ ప్రస్థానం’ పేరుతో పుస్తకం ప్రచురించారు.

కాకినాడ జిల్లా తునిలో ఈ పుస్తకావిష్కరణ, ఆత్మీయ సన్మాన వేడుకను గురువారం నాడు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, నారాయణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు , కూటమి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హోంమంత్రి అనిత

42 ఏళ్ల యనమల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా వెలుగొందారని, ఇది రాజకీయాల్లో అద్భుత ఘట్టమని హోం మంత్రి అనిత అభివర్ణించారు.

సుదీర్ఘ రాజకీయాల్లో యనమల స్పీకర్‌గా, పలుమార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చేలా స్ఫూర్తిదాయకమైన పాలన అందించారని హోం మంత్రి అనిత ఉద్ఘాటించారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేతగా యనమల రామకృష్ణుడు ఎదిగారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

పుస్తకం ఆవిష్కరణ అనంతరం చదువుతున్న హోంమంత్రి అనిత

యనమల రామకృష్ణుడుకి సంబంధించిన ఫొటోలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ ఫొటోలను ఆసక్తిగా తిలకిస్తున్న హోంమంత్రి అనిత
Updated at - Apr 11 , 2025 | 10:43 AM