AP Election Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిది.. ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి..
ABN, Publish Date - Jun 01 , 2024 | 04:14 PM
ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల పోలింగ్ తర్వాత, ఫలితాలకు ముందు వచ్చే సర్వేలు.! సెమీ ఫైనల్ లాంటి ఈ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. వాస్తవానికి పోలింగ్ రోజు లేదా ఆ తర్వాత రోజు రావాల్సిన ఎగ్జిట్ పోల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యి.. దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆలస్యం కాస్త జూన్-01 వరకూ వెళ్లింది. దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు పూర్తవ్వడంతో ఇవాళ అనగా శనివారం నాడు..
ఎగ్జిట్ పోల్స్.. (AP Exit Polls) ఎన్నికల పోలింగ్ తర్వాత, ఫలితాలకు ముందు వచ్చే సర్వేలు.! సెమీ ఫైనల్ లాంటి ఈ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. వాస్తవానికి పోలింగ్ రోజు లేదా ఆ తర్వాత రోజు రావాల్సిన ఎగ్జిట్ పోల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యి.. దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆలస్యం కాస్త జూన్-01 వరకూ వెళ్లింది. దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు పూర్తవ్వడంతో ఇవాళ అనగా శనివారం నాడు సాయంత్రం ఆరున్నర (06:30) గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా..? జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి టీవీ చానెల్, ఆంధ్రజ్యోతి.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది. అది కూడా ఒకే ఒక్క క్లిక్‌తో ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.. ఇంకెందుకు ఆలస్యం క్లిక్ చేయండి.. తెలుసుకోండి..!
ఇదిగో ఇక్కడే క్లిక్ చేయండి..
AP Exit Polls 2024 Live Updates: ఏపీ ఎగ్జిట్ పోల్స్.. రాబోయే ప్రభుత్వం ఎవరిది?
Lok Sabha Election Exit Poll Results Live Updates: దేశాన్ని ఏలేది ఎవరు..ఎగ్జిట్ పోల్ ఫలితాలు..
అతుక్కుపోయారు..!
ఎగ్జిట్ పోల్స్ రిలీజ్‌కు కొన్ని గంటల ముందే తెలుగు రాష్ట్రాల ప్రజలు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు టీవీలు, యూట్యూబ్.. వెబ్‌సైట్లకు అతుక్కుపోయారు. ఇన్నాళ్లు ఏపీ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూసిన పరిస్థితులు చూశాం.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పోలింగ్‌కు ఫలితాలకు మధ్య చాలా గ్యాప్ రావడంతో పోటీచేసిన అభ్యర్థులే కాదు.. ఓటేసిన ఓటర్లు, కార్యకర్తలు, నేతలు సైతం ఆగలేకపోతున్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్ల గురించి అయితే అబ్బో మాటల్లో చెప్పలేం అంతే.. అలా ఉంది ఏపీలో పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చాక పరిస్థితి ఎలా ఉండబోతోంది..? వైసీపీ రెండోసారి గెలిచి అధికారం కంటిన్యూ అవుతుందా..? లేదంటే కూటమి గెలిచి చరిత్ర సృష్టిస్తుందా..? అనేది చూడాలి.
Updated Date - Jun 01 , 2024 | 06:20 PM