ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Sharmila : వైఎస్ షర్మిల ఏపీకి వెళ్తే పరిస్థితేంటి.. సీఎం జగన్ బంపరాఫరిచ్చారా..!?

ABN, Publish Date - Jan 01 , 2024 | 10:59 PM

YS Sharmila AP Political Entry Issue : వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ సారథిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. న్యూఢిల్లీ వేదిగా ఏపీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ దాదాపు తేల్చేశారు. ఇక అధికారి క ప్రకటన మాత్రమే మిగిలుంది..

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ సారథిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. న్యూఢిల్లీ వేదిగా ఏపీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ దాదాపు తేల్చేశారు. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుంది. షర్మిల పార్టీ పగ్గాలు చేపడితే ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని రాష్ట్ర నేతలు మొదలుకుని.. ఢిల్లీ పెద్దలు వరకు ఆశిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలోనే ఏపీ కాంగ్రెస్‌కు సంబంధించి కీలక ప్రకటనే రాబోతోందని తెలుస్తోంది. గతంలో ఒకట్రెండు సార్లు ఏపీకి వెళ్లనని.. ఏమున్నా తెలంగాణలోనే రాజకీయం చేస్తానని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు.. షర్మిల కూడా ఏపీకి వెళ్లి పార్టీ పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న సమయంలోనే ‘పుట్టింటికి రావొద్దు చెల్లి’ అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో రాయబారం నడుపగా.. సమస్యే లేదు ఒప్పుకోనంటే ఒప్పుకోనని ఆమె తెగేసి చెప్పేశారనే టాక్ కూడా నడుస్తోంది.


ఏపీకి వస్తారు సరే..?

ఇదంతా ఓకే కానీ.. షర్మిల ఒకవేళ ఏపీకి వెళితే ఏం జరగబోతోంది..? వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు..? అసలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారా.. లేకుంటే స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే పరిమితం అవుతారా..? లేకుంటే పోటీచేస్తారా..? పోటీ చేస్తే ఎక్కడ్నుంచి..? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? లేకుంటే ఎంపీగా పోటీ చేస్తారా..? ఇప్పుడివే ప్రశ్నలు అటు వైఎస్ వీరాభిమానుల్లో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే చిత్రవిచిత్రాలుగా కొందరు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల అభిమానులు మాట్లాడేసుకుంటున్నారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు షర్మిల ముందు కాంగ్రెస్ పెద్దలు మూడు ఆప్షన్లు ఉంచినట్లుగా తెలియవచ్చింది. ఇందులో ఒకటి.. తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాక ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టడం. ఇక రెండోది.. పార్టీ పగ్గాలు చేపట్టడంతో పాటు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడం. ఇక మూడోది.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అవ్వడం.. ఈ మూడు ఆప్షన్లు షర్మిల ముందు కాంగ్రెస్ అధిష్టానం ఉంచినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.


షర్మిల మనసులో ఏముందో..?

వైఎస్ షర్మిలకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ మూడు ఆప్షన్లు కాకుండా రాజ్యసభ ఎంపీ పదవి తీసుకొని.. కేవలం ఏపీలో ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతారట. అయితే.. అన్న వదిలిన బాణమైన షర్మిలను కడప ఎంపీగా బరిలోకి దింపడానికే కాంగ్రెస్ అధిష్టానం ఇంట్రెస్ట్ చూపిస్తోందట. మరోవైపు.. అబ్బే.. అదేం లేదు ‘వైఎస్ జగన్-వైఎస్ షర్మిల మధ్య డీల్ కుదిరింది.. సీఎం బంపరాఫర్ ఇచ్చారు’ అని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వడంతో పాటు రాజకీయంగా అన్నీ చూసుకుంటానని జగన్ రాయబారం పంపారని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే కడప పార్లమెంట్ నుంచి వైసీపీ తరఫున ఎంపీగా.. ఒప్పుకోని పక్షంలో రాజ్యసభ సభ్యురాలిగా ఏపీ నుంచి వైసీపీ తరఫున వెళ్తారనే మాట జగన్ వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. కొందరు ముఖ్య కార్యకర్తల ద్వారా ఇలా వైఎస్ జగన్ లీకులు చేయిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు.. వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే కబురు షర్మిల దగ్గరికి మోసుకెళ్లారనే టాక్ కూడా నడుస్తోంది. చిత్ర విచిత్రాలుగా వార్తలు వస్తుండటం.. సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకోవడంతో షర్మిల అభిమానులు, వైఎస్సార్టీపీ నేతలు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కేడర్ అసలేం జరుగుతోందో తెలియక అయోమయంలో పడిన పరిస్థితి. మరోవైపు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక, దమ్మున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో షర్మిల గురించి వస్తున్న వరుస ప్రత్యేక కథనాలతో తాడేపల్లి విలవిల్లాడుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ వైఎస్ షర్మిల అటు సోషల్ మీడియాలో కానీ.. ఇటు మీడియాతో కానీ మాట్లాడి క్లారిటీ ఇవ్వలేదు. మున్ముందు ఇంకా ఎలాంటి వార్తలు వస్తాయో..? రాజకీయంగా షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Updated Date - Jan 01 , 2024 | 11:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising