ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: బొత్స ఎంపికపై వైసీపీ నేతల్లో గరంగరం!

ABN, Publish Date - Aug 03 , 2024 | 09:23 AM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఖరారు చేయడంపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి..

Botsa Satyanarayana

  • స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పొరుగు జిల్లా..

  • నేతను ఎంపిక చేయడంపై ఉమ్మడి జిల్లా వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి

  • పక్క జిల్లా నాయకుడిని తీసుకువచ్చి..

  • పోటీ చేయించాల్సిన అవసరమేమిటంటూ ఆగ్రహం

  • ఉమ్మడి జిల్లాలో నాయకులే లేరా..? అంటూ ప్రశ్నలు

  • మొన్న ఆయన భార్యకు ఎంపీ సీటు..

  • ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ సీటు

  • ఎన్నిక అనివార్యమైతే బొత్స విజయం కోసం..

  • ఎంతమంది మనస్ఫూర్తిగా పనిచేస్తారనేది అనుమానమే


ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఖరారు చేయడంపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌ బయటకు వెళ్లిపోవడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం ఎంతోమంది కాచుకు కూర్చున్నారు. సాధారణ ఎన్నికల్లో అవకాశం కల్పించలేకపోయిన వారికి ఇస్తారని కోలా గురువులు వంటి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా పార్టీ అభ్యర్థులంతా ఓడిపోవడంతో అందరి కళ్లు శాసన మండలిపై పడ్డాయి. ఎలాగైనా అధికారంలో కొనసాగాలనే తాపత్రయంతో మొన్నటివరకు అధికారం అనుభవించిన వారంతా ఈ ఎమ్మెల్సీ టికెట్‌ను ఆశించారు. కానీ ఊహించని విధంగా పక్క జిల్లా నాయకుడు బొత్సను అభ్యర్థిగా ప్రకటించడంతో అంతా కంగుతిన్నారు.


అంతా నవ్వు ముఖాలు పెట్టినా..?

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీకి దింపుతున్నట్టు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులతో అమరావతిలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అందరి అభిప్రాయాలు తెలుకున్నాక, బొత్సను అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతా నవ్వు ముఖాలు పెట్టినా లోలోపల మాత్రం కుతకుతలాడిపోతున్నారు. పొరుగు జిల్లాకు చెందిన నాయకుడిని తీసుకువచ్చి ఇక్కడ పోటీకి దింపడం ఏమిటంటూ రుసరుసలలాడుతున్నారు. అసలు...ఈ టికెట్‌ బొత్సకు ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన పోటీలో ఉన్నారనే విషయం కూడా ఎక్కడా బయటకు పొక్కలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే.


అప్పుడు భార్య.. ఇప్పుడేమో..?

అన్ని పార్టీలకు కలిపి మొత్తం 822 మంది ఉన్నారు. రెండున్నరేళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు రెండు స్థానాలకు వైసీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణిలను పోటీకి దింపారు. అప్పుడు కూడా కళ్యాణి అభ్యర్థిత్వంపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమెకు ఇక్కడ ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. అంతకు ముందు ఎన్నికల్లో ఆమె అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ తరఫున పనిచేశారని పార్టీ సర్ది చెప్పింది. దాంతో నాయకులు సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కోటా సీటు ఖాళీ అయితే జిల్లాలో నాయకులు ఎంతోమంది ఉండగా...పొరుగు జిల్లాకు చెందిన బొత్సను ఎంపిక చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీగా బొత్స భార్య ఝాన్సీలక్ష్మిని పోటీకి దింపారు. అప్పుడు ఎవరూ పెద్దగా బాధ పడలేదు. ఎవరికీ ఎంపీగా పోటీ చేసే ఆలోచన, అంత మొత్తం ఖర్చు పెట్టే స్థోమత లేకపోవడంతో మిన్నకున్నారు. ఏమి చేసినా తాము ప్రశ్నించలేమనే ధీమాతోనే అధిష్ఠానం ఇప్పుడు బొత్సను ఎంపిక చేసిందని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


ఆశావాహలు ఎంతోమంది..

ఉమ్మడి విశాఖ జిల్లాలోని వైసీపీలో అనేక మంది సీనియర్‌ నాయకులు ఉన్నారు. తాజా మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌లు ఈ ఎమ్మెల్సీ సీటును బలంగా కోరుకున్నారు. అలాగే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చూసి ఊహించని విధంగా క్రాస్‌ ఓటింగ్‌ వల్ల ఓడిపోయిన మత్స్యకార నాయకుడు కోలా గురువులు కూడా ఈ సీటు తనకే వస్తుందని భావించారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో కరణం ధర్మశ్రీ రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.


అన్నీ వాళ్లకేనా..?

భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎస్‌టీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేశ్‌, పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని కోటవురట్ల మండలంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యానారాయణరాజు, గాజువాక నియోజక వర్గంలో చింతలపూడి వెంకట్రామయ్య, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన కేకే రాజు.. ఇలా పార్టీలో చాలా మంది ఎమ్మెల్సీ టికెట్‌ ఆశించారు. కానీ వీరందరినీ కాదని పక్క జిల్లా విజయనగరానికి చెందిన బొత్సను తీసుకువచ్చి అభ్యర్థిగా ప్రకటించారు. ఇది విశాఖ జిల్లా నాయకులను అవమానించినట్టేనని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయనగరం జిల్లాలో పదవులన్నీ బొత్స కుటుంబానికే కట్టబెట్టారని, పార్టీ ఓడిపోయిన తరువాత కూడా ఆ కుటుంబం హవానే సాగాలనే ధోరణి అధిష్ఠానంలో కనిపిస్తున్నదని, అయితే అది ఆ జిల్లాకే పరిమితమైతే బాగుండేదని, పొరుగు జిల్లాకు తీసుకువచ్చి ఆయన నాయకత్వాన్ని రుద్దడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతమంది పార్టీ అభ్యర్థి విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారనేది అనుమానమే.

Updated Date - Aug 03 , 2024 | 09:32 AM

Advertising
Advertising
<