ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Results: వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు.. చేతులెత్తేసిన వైసీపీ నేతలు..!?

ABN, Publish Date - May 27 , 2024 | 04:24 PM

సరిగ్గా రెండు నెలల క్రితం వైనాట్‌ 175 అంటూ ప్రతి వైసీపీ (YSR Congress) నాయకుడి నోటా వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదనీ, ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు (YSRCP Leaders) బహిరంగ సమావేశాల్లో తెగ హడావుడి చేశారు. సీన్ కట్ చేస్తే...

YSR Congress

  • పందేనికి రాం.. రాం..!

  • వైసీపీ తరఫున బెట్టింగ్‌కు ససేమిరా

  • డీలా పడుతున్న ఆ పార్టీ వర్గాలు

  • లక్షకు రూ.2 లక్షలు ఇస్తామంటున్న

  • కూటమి మద్దతుదారులు

  • అయినా ఎవరూ ముందుకురాని వైనం

అనంతపురం జిల్లా/హిందూపురం: సరిగ్గా రెండు నెలల క్రితం వైనాట్‌ 175 అంటూ ప్రతి వైసీపీ (YSR Congress) నాయకుడి నోటా వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదనీ, ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు (YSRCP Leaders) బహిరంగ సమావేశాల్లో తెగ హడావుడి చేశారు. అప్పట్లో వైసీపీ గెలుస్తుందని పందేనికి సై అంటూ ప్రగల్భాలు పలికారు. అలాంటివారే రానురాను తగ్గుతూ వచ్చారు. ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడేకొద్దీ 90 నుంచి నూరు శాతం వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఆ తరువాత మూడు నాలుగురోజులు కూడా గెలుపు తమదేనంటూ చెప్పుకొచ్చారు. ఏమైందో, ఏం తెలిసిందోగానీ నాలుగు రోజులుగా ఆ పార్టీ తరఫున గెలుస్తుందని పందెం కాయడానికి ఏఒక్కరూ ముందుకు రావట్లేదని సమాచారం. దీంతో కూటమి తరఫున రూపాయికి రెండు రూపాయలు ఇస్తామంటూ డబ్బు కలిపేందుకు సిద్ధంగా ఉన్నా హిందూపురం, పెనుకొండ ప్రాంతంలో ఒక్కరూ ముందుకు రావట్లేదు. నాలుగు రోజుల క్రితం వరకు పందెం కాయడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది వైసీపీ నాయకులను ప్రశ్నిస్తే నోటివెంట మాటరావడం లేదు. హిందూపురం పట్టణంలో కొంతమంది కౌన్సిలర్లు కలిసి రూ.కోటి వేయడానికి సిద్ధంగా ఉన్నామని నాలుగు రోజుల క్రితం పేర్కొన్నారు. నిజమేకదా అని తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు మరికొంతమంది కూటమి గెలుస్తుందని డబ్బు రెడీ చేశాక.. వైసీపీ వారికి ఏమైందోకానీ తాము ఇప్పుడు సిద్ధంగా లేమంటూ చేతులెత్తేశారు.


కూటమి తరఫున ఆన్‌లైన్‌లో వెంపర్లాట!

వైసీపీ తరఫున ప్రత్యక్షంగా ఎవరూ పందేనికి ముందుకు రాకపోవడంతో హిందూపురానికి చెందిన పలువురు కూటమికి 110 నుంచి 130 స్థానాలు వస్తాయని ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ కాస్తున్నారు. ఆన్‌లైన్‌లో వైసీపీ తరఫున పందెం వేసేవారు వేరే రాష్ట్రాలకు చెందినవారు కావడంతో బెట్టింగ్‌ సాగుతోందన్న వాదన వినిపిస్తోంది. అదే రాష్ట్రంలో ఉండి ఐదేళ్లు జగన్‌ పాలన, ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను చూసినవారెవరూ పందేనికి ముందుకు రావడం లేదని కొంతమంది బెట్టింగ్‌ ఆడేవారే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇలా.. నాలుగైదు రోజులుగా వైసీపీ నాయకులు ఎందుకో డీలాపడ్డారు. హిందూపురంతో మొదలుకుని రాష్ట్రంలో అధికారం వరకు బెట్టింగ్‌కు ఆ పార్టీ నాయకులు ఎవరూ ముందుకు రావట్లేదు. పైపైకి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు తప్ప.. పందేనికి వచ్చేసరికి తమకెందుకని జారుకుంటున్నారు. దీనిని బట్టి ఆ పార్టీ నాయకులకే వైసీపీపై నమ్మకం లేదని కూటమి నాయకులు అంటున్నారు.


లక్షకు.. రెండు లక్షలు..

పోలింగ్‌ వరకు లక్షకు లక్ష బెట్టింగ్‌ అనేవారు. పోలింగ్‌ తరువాత రూ.లక్ష వైసీపీ అంటే కూటమి తరఫున రూ.1.10లక్ష ఇస్తామని పందెం ప్రారంభించారు. ప్రస్తుతం వైసీపీ గెలిస్తే రూ.లక్షకు రూ.2 లక్షలు ఇస్తామని కూటమి తరఫున నాయకులు అంటున్నారు. అయినా వైసీపీ తరఫున ఏఒక్కరూ ముందుకు రావట్లేదు. చాలామంది నాయకులు కూటమి తరఫున పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నా వైసీపీ గెలుపుపై బెట్టింగ్‌కు ఎవరూ ముందుకు రావట్లేదు. మొదట హిందూపురంలో బాలకృష్ణకు కూడా ఎదురుగాలి అని చెప్పుకున్న వైసీపీ నేతలు ప్రస్తుతం పందేనికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో వారికే అర్థం కావాలి. కూటమి నాయకులు బాలయ్య మెజార్టీపై పందేలు వేస్తున్నారు. ఈ పందేల పోరు వచ్చేనెల 1వ తేదీ వరకు ఉంటుంది. 1న ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడితే ఆ తర్వాత ఎవరూ పందెంవేసే వారుండరు.


ఇవి కూడా చదవండి


Election Counting: 4న ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు..


YS Jagan: తల్లి, చెల్లిని పావుగా వాడుకున్న జగన్



Updated Date - May 27 , 2024 | 04:53 PM

Advertising
Advertising