Share News

Viral Video: టాప్ లెస్ కారులో అంబానీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తోందో..

ABN , Publish Date - Oct 23 , 2024 | 08:54 AM

ఆకాశ్ అంబానీ టాప్ లెస్ రోల్స్ రాయిస్ కారు నడుపుతుండగా ఇషా అతని పక్కన కూర్చున్నారు. శ్లోకా మెహతా వెనక సీటులో కూర్చున్నారు.

Viral Video: టాప్ లెస్ కారులో అంబానీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తోందో..

ముంబై: భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ కవల పిల్లలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ ముంబై రోడ్లపై కారులో తిరుగుతున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆకాశ్, ఇషా ఇంబానీలు, ఆకాశ్ భార్య శ్లోకా మెహతా ముగ్గురూ తమ రోల్స్ రాయిస్‌ కారులో నైట్ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియో అది. వారు ముంబై రోడ్లపై తిరుగుతుండగా ఓ ఔత్సాహికుడు వారిని వీడియో తీశాడు. ఆ వీడియోను ‘సోచ్‌ ఎక్స్‌ ఇండియా’ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


ఆకాశ్ అంబానీ టాప్ లెస్ రోల్స్ రాయిస్ కారు నడుపుతుండగా ఇషా అతని పక్కన కూర్చున్నారు. శ్లోకా మెహతా వెనక సీటులో కూర్చున్నారు. మంగళవారం అర్ధరాత్రి వేళ ముంబై నగరంలో వారంతా చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. వీడియో గ్రాఫర్ హాయ్ అని చెప్పడంతో వారు అతని వైపు చూసి నవ్వులు కురిపించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను సోచ్ ఎక్స్ ఇండియా పోస్టు చేస్తూ అంబానీలు.. లగ్జరీని మరోస్థాయికి తీసుకెళ్లారంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. "సాధారణ వ్యక్తి జీవిత కల అంబానీల జీవితాల్లో ఓ రోజు, బతికితే ఇలా ఒక్కరోజైనా బతకాలని, అంబానీలు షో ఆఫ్ చేస్తున్నారు, ముఖేశ్ అంబానీ వారి పిల్లలకు అద్భుతమైన జీవితం అందించారు" అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.


ఆకాశ్ అంబానీ గురించి..

2021 సంవత్సరంలో నాయకత్వ మార్పులో భాగంగా తన పిల్లలు ఇకపై ఎక్కువ బాధ్యతలు స్వీకరిస్తారని ముఖేశ్ అంబానీ ప్రకటించారు. తన తండ్రి రిలయన్స్ వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ దేశ వృద్ధికి దోహదపడినట్లుగానే తమ తదుపరి తరం కూడా ముందుకు వస్తుందని ఆయన చెప్పారు. ఆ మేరకు ఆకాశ్ అంబానీ జూన్ 2022లో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. మార్చి 09, 2019న శోక్లా మెహతాను ఆయన వివాహం చేసుకున్నారు.


ఇషా అంబానీ గురించి..

ఇషా అంబానీ యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో డబుల్ మేజర్‌తో పట్టభద్రురాలు అయ్యింది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల అధినేతల తదుపరి తరం రైజింగ్ స్టార్ టాప్-100లో ఆమె చోటు సంపాదించింది. అలాగే ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డ్స్-2023లో ప్రతిష్టాత్మకమైన GenNext ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుతో కూడా ఆమె పొందారు. హురున్ ఇండియా-2024 అండర్-35 జాబితాలోనూ ఇషా చోటు దక్కించుకున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 08:58 AM