Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..
ABN, Publish Date - Aug 07 , 2024 | 12:41 PM
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు బోట్లపై వెళ్లి మరీ వరదల్లో చిక్కుక్కున్న వారిని రక్షిస్తుంటారు. అయితే తాజాగా, ఇలాంటి ఓ వీడియో చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర అవాక్కయ్యారు. కొందరు యువకులు మహీంద్రా జీపును పడవ తరహాలో వాడి బాధితులను రక్షించడంపై ఆయన వారిని అభినందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో (Kerala) జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాల (Heavy rains) కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలో (floods) మునిగిపోయాయి. దీంతో బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మరోవైపు చాలా స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల్లోని యువకులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
Viral Video: జింక మాంసం కోసం హైనాల పోరాటం.. దాచిపెట్టడానికి చిరుతల ఆరాటం.. చివరకు..
అయితే ఈ సందర్భంగా కొందరు యువకులు మహీంద్రా జీపులో (Mahindra Jeep) వెళ్లి వరద బాధితులను కాపాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జీపులో కొందరు, జీపు పైన కొందరు కూర్చుని వరద నీటిలోకి వెళ్లారు. ఆ సమయంలో వాహనం స్టీరింగ్ వరకూ మునిగిపోయింది. అయినా ఎక్కడా వాహనం ఆగిపోలేదు. జీపులో కూర్చున్న వారు కూడా పూర్తిగా తడిచిపోయారు. అయినా ఏమాత్రం భయపడకుండా అలాగే వెళ్లారు. చాలా దూరం వరకు వెళ్లి ఇళ్లల్లో ఉన్న బాధితులను జీపుపై కూర్చోబెట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇలా వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి చాలా మంది బాధితులను రక్షించారు.
Viral Video: కిడ్నాప్ చేసిన కారు నుంచి ఎలా తప్పించుకోవాలో.. సింపుల్ ట్రిక్‌తో చెప్పేశాడుగా..
దూరం నుంచి చూసేవారికి వారు పడవలో వెళ్లి కాపాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇలా ఎవరూ చేయనివిధంగా జీపుతో వరదలో సహాయకచర్యలు చేపట్టడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో వైరల్ అవడంతో ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) వరకూ వెళ్లింది. ఈ వీడియో చూసిన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. యువకులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ వరద బాధితులను కాపాడడంపై వారిని అభినందించారు. అలాగే వీరిని అనుకరించి వరద నీళ్లలో ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయొద్దంటూ సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: స్కూటీ మిడిల్ స్టాండ్ వేయాలంటే ఇబ్బందిగా ఉందా.. ఇతడి సింపుల్ ట్రిక్ చూడండి..
Updated Date - Aug 07 , 2024 | 12:41 PM