Share News

Viral News: ట్యాలెంట్ కాదు.. జాతకమే ముఖ్యం.. ఆ రాశిలో పుట్టిన వారు అప్లై చేయొద్దంటూ చైనా కంపెనీ వినూత్న ప్రకటన!

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:04 PM

సాధారణంగా ఏదైనా కంపెనీ ఉద్యోగాలు ఇచ్చేటపుడు అభ్యర్థికి మంచి అనుభవం ఉందా, ట్యాలెంట్ ఉందా, ప్రవర్తన బాగుంటుందా అని చూసుకుంటుంది. నైపుణ్యాలు, అంకిత భావం ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది. అయితే చైనాలోని ఓ సంస్థ మాత్రం అభ్యర్థి ప్రతిభ కంటే రాశి చక్రానికే ఎక్కువ విలువ ఇచ్చింది.

Viral News: ట్యాలెంట్ కాదు.. జాతకమే ముఖ్యం.. ఆ రాశిలో పుట్టిన వారు అప్లై చేయొద్దంటూ చైనా కంపెనీ వినూత్న ప్రకటన!
company recruits candidates based on their zodiac sign

సాధారణంగా ఏదైనా కంపెనీ ఉద్యోగాలు (Job) ఇచ్చేటపుడు అభ్యర్థికి మంచి అనుభవం ఉందా, ట్యాలెంట్ ఉందా, ప్రవర్తన బాగుంటుందా అని చూసుకుంటుంది. నైపుణ్యాలు, అంకిత భావం ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది. అయితే చైనా (China)లోని ఓ సంస్థ మాత్రం అభ్యర్థి ప్రతిభ కంటే రాశి చక్రానికే ఎక్కువ విలువ ఇచ్చింది. ఫలానా రాశిలో పుట్టిన వారు ఉద్యోగానికి అప్లై చేయవద్దంటూ బహిరంగంగా ప్రకటన విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).


చైనీస్ పంచాంగం (China Zodiac Sign) ప్రకారం 12 రాశి గుర్తులు ఉన్నాయి. ఒక్కో సంవత్సరానికి ఒక్కో రాశి గుర్తును కేటాయిస్తారు. 12 పూర్తయిన తర్వాత మళ్లీ పునరావృతమవుతాయి. కాగా, దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ సంస్థ తాజాగా ఓ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఆ సంస్థ ఓ క్లర్క్ ఉద్యోగానికి ప్రకటన విడుదల చేసింది. 3,000 నుంచి 4,000 యువాన్ల (రూ. 35,000 నుంచి రూ. 45,000) వరకు జీతం ఇస్తామని ప్రకటించింది. నిజానికి ఇది ఆ ప్రాంతంలోని సగటు జీతంలో సగం మాత్రమే. ఆ మాత్రం జీతానికే ఆ సంస్థ (China Company) ఓ విచిత్రమైన రూల్ పెట్టింది.


చైనీస్ క్యాలెండర్ ప్రకారం ``డాగ్`` (Dog Year) సంవత్సరంలో పుట్టిన వారు ఈ క్లర్క్ ఉద్యోగం కోసం అప్లై చేయవద్దని సూచన చేసింది. దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా వెల్లడించింది. ఆ సంస్థ యజమాని ``డ్రాగన్`` సంవత్సరంలో (Dragon Year) పుట్టాడట. చైనీస్ జ్యోతీష్యం ప్రకారం.. డ్రాగన్, డాగ్‌లు ఒకదానికి ఒకటి పూర్తి వ్యతిరేకమట. అందుకే ``డ్రాగన్`` అయిన తమ యజమానికి పూర్తి వ్యతిరేకంగా ఉండే ``డాగ్`` సంవత్సరంలో పుట్టిన వారు అక్కర్లేదని ఆ సంస్థ తెగేసి చెప్పింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: రస్క్ తింటే రిస్క్‌ ఖాయం.. టీతో పాటు మీరూ రస్క్‌లు తింటారా? ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!


Optical Illusion: ఈ ఫొటోలో ఎన్ని ఆవులున్నాయో కనిపెట్టండి.. 10 సెకెన్లలో కనిపెడితే మీరు గ్రేట్..!


Viral Video: నమ్మశక్యం కాని వీడియో.. భారీ పర్వతాలపై చిరుతలు ఎలా గెంతుతున్నాయో చూడండి..!


Viral Video: ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు.. మొసలి నోటి నుంచి తాబేలు ఎలా తప్పించుకుందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 11 , 2024 | 04:04 PM