Share News

Viral: ఏం క్రియేటివిటీ! ఇది ఆధార్ కార్డు అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

ABN , Publish Date - Dec 13 , 2024 | 10:29 PM

ఓ జంట తమ వెడ్డింగ్ కార్డును ఆధార్ కార్డు రూపంలో డిజైన్ చేయించుకున్న వైనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Viral: ఏం క్రియేటివిటీ! ఇది ఆధార్ కార్డు అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య జంటలు పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జీవితాంతం గుర్తుండిపోయే ముఖ్య ఘట్టంలో ఏదైనా వెరైటీ ఉండాలని కోరుకుంటున్నాయి. వెడ్డింగ్ కార్డుల డిజైన్, వెరైటీ ఊరేగింపుతో మండపానికి రావడంతో, క్రియేటివిటీ జోడించి ఫొటో షూట్‌లు ఇలా ప్రతి దశలోనూ కొత్తదనం కోరుకుంటున్నాయి. తాజాగా ఓ జంట సరిగ్గా ఇలాగే ప్లాన్ చేసింది. వారి ప్రయత్నం వర్కౌట్ కావడంతో ప్రస్తుతం ఆ పెళ్లి పత్రిక నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).

Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..


డీకే సర్దానా అనే వ్యక్తి ఆ వెడ్డింగ్ కార్డును నెట్టింట షేర్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని పిపారియా గ్రామానికి చెందిన జంట తమ శుభలేఖను ఆధార్ కార్డు రూపంలో డిజైన్ చేయించుకున్నారు. అచ్చు ఆధార్ కార్డును పోలి ఉన్న అక్షరాలు, రంగులు డిజైన్ చేయడంతో చూసేవారు ఒకింత పొరపడ్డారట. ఇదేమిటీ వీళ్లు ఆధార్ కార్డులు పంచుతున్నారు అని క్షణకాలం ఆశ్చర్యపోయారట. కాస్త తెరిపార చూశాక కానీ అది శుభలేఖ అన్న విషయం అర్థంకాలేదట.

Viral: కస్టమర్ ఆగ్రహం! కొత్త కారుతో షోరూమ్‌ను ఢీకొట్టిన వైనం!


ఇక ఈ వైరల్ వెడ్డింగ్ కార్డులో ఆధార్ నెంబర్ ఉండాల్సిన చోట తమ పెళ్లితేదీని ముద్రించారు. ఫొటో ఉండాల్సిన చోట తాము జంటగా దిగిన పాస్‌పోర్టు ఫొటోను పెట్టారు. దీంతో, పాటు శుభలేఖకు క్యూఆర్ కోడ్, బార్ కోడ్‌ను కూడా జత చేశారు. ఇలా పక్కాగా ప్లాన్ చేయడంతో ఆ వెడ్డింగ్ కార్డు నిజమైన ఆధార్ కార్డును తలపించేలా రూపుదిద్దుకుంది.

Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు


కాగా, ఇటీవల ఓ జంట తమ వెడ్డింగ్ కార్డుడు మ్యాక్‌బుక్ ప్రో లాప్‌టాప్‌లా కనిపించేలా డిజైన్ చేయించుకుంది. మరో ఉదంతంలో ఓ జంట మెషిన్ గన్ ఆకారంలో ఉన్న రథంపై కూర్చుని మండపానికి వచ్చింది. ఇటీవలి యానిమల్ సినిమాలో కనిపించిన గన్‌ మాదిరి ఉన్న బొమ్మను వధూవరుల రథంపై అలంకరించారు. ఈ వీడియో కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదే క్రియేటివిటీరా బాబూ అంటూ కొందరు నోరెళ్లబెట్టేలా చేసింది.

Read Latest and Viral News

Updated Date - Dec 13 , 2024 | 10:29 PM