Share News

Viral Video: వరదొచ్చినా విందు ఆరగించాల్సిందే.. భార్యలను ఎత్తుకొని మరీ ఎలా వెళ్తున్నారో చూడండి..

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:33 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఇలాంటి వర్షాలు, వరదల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి.

Viral Video: వరదొచ్చినా విందు ఆరగించాల్సిందే.. భార్యలను ఎత్తుకొని మరీ ఎలా వెళ్తున్నారో చూడండి..
Flood

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు (Floods) గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఇలాంటి వర్షాలు, వరదల్లో ఎవరైనా పెళ్లి (Marriage) చేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. భారీ వర్షాల కారణంగా ఓ పెళ్లి మండపం మోకాలి నీటి లోతులో మునిగిపోయింది. అయినా పెళ్లి విందు (Feast) కోసం జనాలు ఎగబడ్డారు.


@ChapraZila అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెళ్లి మండపం కనిపిస్తోంది. అయితే ఆ ప్రాంతమంతా మోకాలి లోతు నీటితో నిండిపోయింది. అయినా ఆ పెళ్లికి జనాలు వెళ్లడం మాత్రం మానలేదు. ఆ నీటిలో తడుముకుంటూనే కళ్యాణ మండపానికి చేరుకుంటున్నారు. చాలా మంది పురుషులు తమ భార్యలను ఎత్తుకుని మరీ కల్యాణ మండపానికి వెళుతున్నారు. ఆ ఘటన మొత్తాన్ని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


``ఎంత వరద వచ్చినా విందు భోజనం మాత్రం మిస్ అవకూడదు. ఈ స్ఫూర్తి చెక్కు చెదరకూడదు`` అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 6 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. వధువు ఎలా వెళ్లిందో``, ``ఇలా జరగకుండా ఉండాల్సింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ చెరువులో దాక్కున్న తాబేలును కనిపెట్టండి.. మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి..!


Viral: వధువు మెడలో తాళి కడుతుండగా వచ్చిందో మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 15 , 2024 | 11:34 AM