Share News

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

ABN , Publish Date - Oct 08 , 2024 | 09:36 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు రోడ్డు పక్కన నిలబడి షేరింగ్ ఆటోల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలోనే ఓ కారు అటుగా వస్తుంది. రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులను చూసి ..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

బస్సు, రైలు ప్రయాణాల్లో ఫుట్‌బోర్డ్ మీద నిలబడి కొందరు, కదులుతున్న సమయంలో ఎక్కుతూ, దిగుదూ మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారు దిగడంలోనూ తొందరపడ్డాడు. దీంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు రోడ్డు పక్కన నిలబడి షేరింగ్ ఆటోల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలోనే ఓ కారు అటుగా వస్తుంది. రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులను చూసి కారు (car) డ్రైవర్ ఆపేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: అయ్యో.. ఈ జింకకు ఎంత కష్టం వచ్చింది.. మొసలిని ఓడించి గట్టుకొచ్చింది కానీ.. అంతలోనే..


అయితే ఆ కారుకు ఓ వ్యక్తి డోరు వద్ద నిలబడి ఉంటాడు. కారు ఆపకుండానే పైనుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వేగాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకు పరుగెత్తుతాడు. అప్పటికీ అదుపు చేసుకోలేక చివరకు ఆ పక్కనే ఉన్న (man fell into canal while getting out of car) కాలువలో ధబేల్‌మని పడిపోతాడు. అయితే కాలువ ఎక్కువ లోతు లేకపోవడం వల్ల గాయాలేమీ కాలేదు.

Viral: ట్యాక్సీ డ్రైవర్ నుంచి మెసేజ్.. లండన్‌లో పిల్లలను వదిలి ఇండియాకు.. ఆరా తీసిన భర్తకు దిమ్మతిరిగే షాక్..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందర కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో 1200కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 08 , 2024 | 09:36 PM