Share News

Viral Video: శవం కాలుతుందా లేదా అని చూసేందుకు వెళ్లగా.. చితి పక్కనే షాకింగ్ సీన్.. విషయం ఏంటా అని ఆరాతీయగా..

ABN , Publish Date - Jan 02 , 2024 | 06:17 PM

ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలా ఫోన్‌తో వీడియోలు తీయడం, అలా నెట్టింట్లోకి వదలడం సర్వసాధారణమైపోయింది. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. తాజాగా...

Viral Video: శవం కాలుతుందా లేదా అని చూసేందుకు వెళ్లగా.. చితి పక్కనే షాకింగ్ సీన్.. విషయం ఏంటా అని ఆరాతీయగా..

ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలా ఫోన్‌తో వీడియోలు తీయడం, అలా నెట్టింట్లోకి వదలడం సర్వసాధారణమైపోయింది. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. తాజాగా, ఓ శ్మశానవాటికకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. శవం కాలుతుందా లేదా అని చూసేందుకు వెళ్లిన వారికి చితి పక్కనే షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ (Kanpur) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక శ్మశాన వాటికలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటిలో ఇటీవల ఓ మృతదేహాన్ని దహనం చేశారు. అయితే కాసేపటి తర్వాత కొందరు అక్కడికి వెళ్లారు. శవం కాలుతుందా లేదా అని పరిశీలించేందుకు వెళ్లగా.. (old man lying next to burning pyre) చితి పక్కనే ఓ వృద్ధుడు పడుకుని ఉండడం చూసి షాక్ అయ్యారు.

Viral Video: ఇతడి పావురం మ్యాజిక్ ట్రిక్‌ను పసిగట్టేసిన కెమెరా.. స్లోమోషన్‌లో చూస్తే.. అవాక్కయ్యే సీన్..

చికి పక్కనే వృద్ధుడిని చూడగానే భయపడ్డ వారు.. తర్వాత కాసేపటికి సమీపానికి వెళ్లి అతన్ని నిద్ర లేపి విచారించారు. ఇక్కడెందుకు పడుకున్నావని అడగ్గా.. చలిగా ఉండడంతో వెచ్చదనం కోసం చితి పక్కన పడుకున్నట్లు తెలిపాడు. ఈ మాట వినగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వీడియో కావాలనే ప్లాన్ చేసి తీసినట్లుగా ఉంది’’.. అని కొందరు, ‘‘ఈ పెద్దాయనకు ధైర్యం ఎక్కువే’’.. అంటూ మరికొందరు, ‘‘చలి కాచుకునేందుకు శవమే దొరికిందా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇళ్ల ముందు రంగు సీసాలను వేలాడదీసిన ప్రజలు.. ఈ ట్రిక్ వల్ల ప్రయోజనం ఏంటని అడిగితే.. షాకింగ్ రిప్లై..

Updated Date - Jan 02 , 2024 | 06:17 PM