Viral Video: రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు.. బయటికి వెళ్లి టీ తాగిన డ్రైవర్.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN, Publish Date - Dec 22 , 2024 | 01:54 PM
ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమదాలు జరిగే సమయంలో ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి..
ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమదాలు జరిగే సమయంలో ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కారు అత్యంత వేగంగా వెళ్తూ రోడ్డుపై 8 పల్టీలు కొట్టింది. చివరకు అందులో నుంచి దిగిన డ్రైవర్ టీ తాగాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) నాగౌర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు హైవేపై వేగంగా వెళ్తుండగా మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మలుపు వద్ద వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో వాహనం బ్యాలెన్స్ తప్పింది. సుమారు 8 పల్టీలు కొట్టిన కారు.. రోడ్డు పక్కన ఉన్న ఓ షోరూం కాంపౌండ్‌ను (car accident) ఢీకొని ఆగిపోయింది.
Viral Video: రైతు కొంప ముంచిన రైలు.. ఈ ప్రయాణికులు చేసిన పని చూస్తే..
అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అందులో ఉన్న నలుగురికీ ఏమీ కాలేదు. వాహనం ఢీకొన్న కాసేపటికి అందులో నుంచి బయటికి వచ్చిన డ్రైవర్.. నేరుగా షోరూంలోకి వెళ్లాడు. తనకు ఓ టీ కావాలని అడగడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, చిన్న గీత కూడా పడలేదని షోరూంకు సంబంధించిన అధికారి తెలిపారు. ఈ కారు నాగౌర్ నుంచి బికనీర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అధిక వేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
మొత్తానికి ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాద ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అదృష్టం అంటే వీళ్లదే’’.. అంటూ కొందరు, ‘‘అధిక వేగం అత్యంత ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: చీరలో సింపుల్‌గా ఉన్నా.. టాలెంట్ మామూలుగా లేదుగా.. పామును ఎలా పట్టేసిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 22 , 2024 | 01:54 PM