Shocking Video: వామ్మో.. అంత అహంకారమా? కారును అడ్డుకున్న పోలీసులపై పాక్ మహిళ తీవ్ర ఆగ్రహం.. ఏం చేసిందో చూస్తే..!
ABN , Publish Date - Apr 26 , 2024 | 03:57 PM
అనుమతికి మంచి వేగంగా కారు నడుపుతోందనే కారణంతో ఓ కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులకు ఆ మహిళ చుక్కలు చూపించింది. వారితో వాగ్వాదానికి దిగింది. బూతులు తిట్టింది. అయినా పోలీసులు కదలనివ్వకపోవడంతో ఏకంగా వారి పైకి కారును ఎక్కించి దూసుకెళ్లిపోయింది.
అనుమతికి మంచి వేగంగా కారు (Car) నడుపుతోందనే కారణంతో ఓ కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులకు (Traffic Police) ఆ మహిళ చుక్కలు చూపించింది. వారితో వాగ్వాదానికి దిగింది. బూతులు తిట్టింది. అయినా పోలీసులు కదలనివ్వకపోవడంతో ఏకంగా వారి పైకి కారును ఎక్కించి దూసుకెళ్లిపోయింది. పాకిస్తాన్‌లోని (Pakistan) ఇస్లామాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Viral Video).
ఇస్లామాబాద్‌కు చెందిన ఓ మహిళ వేగంగా కారు నడపడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె కారును ఆపి చలానా వేశారు. అలా చలానా వేయడంపై ఆ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురైంది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. వారిపై నోటికొచ్చినట్టు బూతులు కురిపించింది. ఫైన్ కట్టేది లేదని తెగేసి చెప్పింది. ఫైన్ కట్టకపోతే కదలినవ్వబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ఓ పోలీస్ అధికారి ఆమె కారు ముందు నిల్చున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ ఆ పోలీసు అధికారి పైకి కారును పోనిచ్చాడు. కారు ఢీకొనడంతో ఆ పోలీస్ పక్కనున్న పేవ్‌మెంట్‌పై పడ్డాడు.
పోలీసులు ఆమె కారును ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. ఆ మహిళపై హత్యాయత్నం సహా పలు అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 68 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆమె తీవ్ర అహంకారరానికి ప్రతిరూపం``, ``ఆమె మాట్లాడే మాటలు వినండి``, ``ఆమెను రోడ్డుపై తిరగనివ్వకూడదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..