Viral Video: పాకిస్తాన్‌లో అమ్మాయిలు లేరా? ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పేది వింటే షాక్ అవ్వాల్సిందే..
ABN , Publish Date - Oct 19 , 2024 | 08:24 AM
ఓ విదేశీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తాజాగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. అక్కడ మహిళల విషయంలో ఎదురైన అనుభవాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మన పొరుగు దేశం పాకిస్తాన్ (Pakistan)లో మహిళల పరిస్థితి గురించి రకరకాల కథలు వినబడుతుంటాయి. అక్కడ స్త్రీలకు (Pakistan Women) స్వేచ్ఛ ఉండదని, బయట కనిపించడం చాలా అరుదని చెబుతుంటారు. ఆ కథలన్నీ నిజాలేననే అనుమానాలు కలిగించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ విదేశీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తాజాగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
princesapolynesia అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ వీడియోను షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆమె ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అక్కడ ఆమెకు అందరూ పురుషులే కనిపించారు. తను తప్ప మరో మహిళ అక్కడ లేదని ఆమె చెబుతోంది. అనంతరం ఇస్లామాబాద్ వీధుల్లోనూ, జంక్షన్ల వద్ద కూడా అందరూ పురుషులే తప్ప మహిళలు ఎక్కడా కనిపించలేదు. ``హలో ఇస్లామాబాద్.. మేము నగరంలో ఎక్కడికి వెళ్లినా, మహిళలు, పురుషుల నిష్పత్తి 1:50గానే ఉంది. అసలు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు?`` అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.7 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాకిస్తాన్‌లోని మహిళలు ఇంత కఠినమైన జీవితాన్ని గడపవలసి రావడం చాలా బాధాకరం, వారు స్వేచ్ఛగా బయటకు కూడా వెళ్లలేరు``, ``అమ్మాయిలు ఇంట్లో వంట చేస్తున్నారు, పురుషులు సంపాదించడానికి బయటకు వెళ్తున్నారు``, ``మహిళల హక్కులకు విఘాతం కలిగించే ఏ దేశమూ అభివృద్ధి సాధించలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువా?.. అయితే ఈ ఫొటోలో వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.