ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రేమికుల గొడవ.. చివరకు ప్రియురాలు చేసిన పనికి అంతా షాక్..

ABN, Publish Date - May 28 , 2024 | 03:13 PM

ప్రేమికులకు మధ్య కొన్నిసార్లు అనూహ్య గొడవలు తలెత్తుతుంటాయి. ఇలాంటి గొడవలు అప్పుడప్పుడూ చాలా దూరం వెళ్తుంటాయి. ఈ క్రమంలో ప్రేమికుల్లో ఎవరో ఒకరు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ప్రేమికులకు మధ్య కొన్నిసార్లు అనూహ్య గొడవలు తలెత్తుతుంటాయి. ఇలాంటి గొడవలు అప్పుడప్పుడూ చాలా దూరం వెళ్తుంటాయి. ఈ క్రమంలో ప్రేమికుల్లో ఎవరో ఒకరు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రేమ జంట మధ్య ఉన్నట్టుండి గొడవ మొదలవుతుంది. ఈ క్రమంలో చివరకు ప్రియురాలు చేసిన పని చూసి ఆమె ప్రియుడితో పాటూ అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఆగ్రాలోని రాజా కి మండి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రాణి అనే మహిళ తన ప్రియుడితో కలిసి స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చుని ఉంది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో గానీ.. (Quarrel between lovers) ప్రేమ జంట మధ్య ఉన్నట్టుండి గొడవ మొదలైంది. దీంతో చివరకు తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ప్లాట్‌ఫామ్‌పై నుంచి రైలు పట్టాలపైకి దిగింది.

Viral Video: దండ వేయగానే వధువు చేసిన పనికి వరుడు షాక్.. అనుమానంగానే ఆమె మెడలో దండ వేయగా..


అదే సమయంలో గ్వాలియర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చింది. రైలును చూడగానే ఆమె ప్రియుడు గట్టిగా అరుస్తూ పక్కకు వెళ్లమని వారించాడు. అలాగే ట్రైన్ డ్రైవర్ కూడా హారన్ మోగిస్తూ హెచ్చరించాడు. దీంతో మహిళ మళ్లీ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే రైలు సమీపానికి రావడంతో ప్రమాదం జరిగింది. మహిళను ఢీకొన్న రైలు (woman was hit by train) సుమారు 100 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లింది. ఆమెను రైలు ఢీకొనగానే ప్రియుడు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. రైలు కింద పడిపోయిన ఆమెను చూసి భయంతో ముందుకు పరుగులు తీశాడు.

Viral Video: ఇది పిల్లి కాదు పులి.. పాముతో ఎలా ఫైట్ చేస్తోందో చూస్తే..


సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఆమెను బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. సదరు మహిళకు అప్పటికే వివాహమైందని, ఆ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని విచారణలో తెలిసింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘చిన్న చిన్న సమస్యలకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: నిప్పు లేకుండానే ఫిష్ ఫ్రై చేసిన యువతి.. విషయం తెలిస్తే..

Updated Date - May 28 , 2024 | 03:34 PM

Advertising
Advertising