Share News

Shocking Video: నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి కిడ్నాప్.. పుణెలో పట్టపగలే దారుణం.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jun 22 , 2024 | 01:47 PM

పట్టపగలు, నడిరోడ్డు మీద పుణె మహా నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను కొందరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి కారులోకి ఎక్కించారు. అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు. పట్టపగలే ఈ దారుణ ఘటన జరిగినా ఎవరూ స్పందించలేదు.

Shocking Video: నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి కిడ్నాప్.. పుణెలో పట్టపగలే దారుణం.. వీడియో వైరల్!
Woman Kidnapped in Pune

పట్టపగలు, నడిరోడ్డు మీద పుణె (Pune) మహా నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను కొందరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి కారులోకి ఎక్కించారు. అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు. పట్టపగలే ఈ దారుణ ఘటన జరిగినా ఎవరూ స్పందించలేదు. అయితే ఆ ఘటన మొత్తం అక్కడున్న హోటల్‌లో అమర్చిన కెమేరాలో రికార్డు అయింది. ఈ ఘటనలో ఆ మహిళను కిడ్నాప్ (Kidnap) చేసింది భర్త, అత్తమామలే అని తెలుస్తోంది (Crime News).


పింప్రి-చించివాడ ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న మహిళను ఆఫీస్ నుంచి ఆమె భర్త, అత్తమామలు లాక్కెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 3:15 గంటలకు ఆఫీస్‌కు వచ్చిన సుమిత్ షహానే అనే వ్యక్తి, అతని తల్లిదండ్రులు ఆ మహిళకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కారులో పడేశారు. అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఆ కారు ఓ గుడి దగ్గర ఆగింది. ఆ సమయంలో ఆ మహిళ కేకలు వేసింది.


ఆ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాపాడారు. కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టేందుకు తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని, మత్తుమందు కూడా ఇచ్చారని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఆమెకు 2023లో వివాహం జరిగింది. మూడు నెలలకే విభేదాలు పెరిగిపోవడంతో అత్తింటిని వదిలిన ఆమె అప్పట్నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఢిల్లీలో అంతే.. తల్లి ప్రేమగా పంపిన లడ్డూ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే.. నివ్వెరపోయిన కూతురు!


Viral Video: ఇంటికి వచ్చిన తల్లికి ఒళ్లు గగుర్పొడిచే షాక్.. కూతురు తింటున్నది చూసి అదిరిపడిన తల్లి.. అసలు కథేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 22 , 2024 | 01:47 PM