Bihar: లోకో పైలట్ నిర్వాకం.. రైలు మధ్యలో చిక్కుకున్న ఉద్యోగి.. చివరికి..
ABN, Publish Date - Nov 09 , 2024 | 06:11 PM
సోన్‌పూర్ రైల్వే డివిజన్ బరౌనీ జంక్షన్‌లో ఇవాళ (శనివారం) రైల్వే పోర్టర్‌గా అమర్‌కుమార్ రావు అనే ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నాడు. లక్నో- బరౌనీ ఎక్స్‌ప్రెస్ (నం: 15204) లక్నో జంక్షన్ నుంచి బరౌనీ ప్లాట్‌ఫారమ్-5కి చేరుకుంది.
బిహార్: బెగుసరాయ్‌లోని బరౌనీ జంక్షన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ట్రైన్ లోకో పైలెట్ నిర్వాకం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నిర్లక్ష్యం కలిగిన ఉద్యోగి చేసిన పనికి నిబద్ధత కలిగిన మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు కేకలు వేస్తున్నా పట్టించుకోని ఆ పైలెట్ తోటి ఉద్యోగి మృతికి కారణం అయ్యాడు. ప్రమాదం అనంతరం నిందితుడు అక్కడ్నుంచి ఉడాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.
సోన్‌పూర్ రైల్వే డివిజన్ బరౌనీ జంక్షన్‌లో ఇవాళ (శనివారం) రైల్వే పోర్టర్‌గా అమర్‌కుమార్ రావు అనే ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నాడు. లక్నో- బరౌనీ ఎక్స్‌ప్రెస్ (నం: 15204) లక్నో జంక్షన్ నుంచి బరౌనీ ప్లాట్‌ఫారమ్-5కి చేరుకుంది. అయితే అమర్ కుమార్ రావు.. ట్రైన్ ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసేందుకు వెళ్లాడు. కప్లింగ్‌లు విడదీస్తుండగా ఆ రైలు లోకో పైలట్ ఒక్కసారి ట్రైన్‌ను రివర్స్ చేశాడు. దీంతో ఆ కార్మికుడు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంజిన్, బోగీ మధ్య ఇరుక్కున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఒక్కసారిగా కేకలు పెడుతూ లోకో పైలట్‌ను హెచ్చరించారు.
అయినప్పటికీ అతను రివర్స్ చేశాడు. దీంతో కార్మికుడు అమర్ కుమార్ రావు తీవ్రంగా నలిగిపోతూ విలవిల్లాడాడు. కాసేపటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఆ లోకో పైలట్ అక్కడ్నుంచి పరారయ్యాడు. స్థానికులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి ఘటనను వీడియో తీశారు. దానికి సంబంధించిన ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ హృదయ విదారకర ఘటనను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
అయితే ప్రమాదానికి కారణమైన లోకో పైలట్ పారిపోవడం పలు అనుమానులకు తావిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలుసులు విచారణ చేపట్టారు. ప్రయాణికులు హెచ్చరిస్తున్నప్పటికీ రైలును వెనక్కి నడపడంపై ఆరా తీస్తున్నారు. ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. అయితే మరణ వార్త విన్న బాధిత కుటుంబం హుటాహుటిన రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రెండు బోగీల మధ్య విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసిన పిల్లలు బోరున విలపించారు. భర్త మరణాన్ని చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. వారి రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన స్థానికులు, ప్రయాణికులను తీవ్రంగా కలచివేసింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Updated Date - Nov 09 , 2024 | 06:47 PM