Viral Video: దాహంతో నడిరోడ్డుపై ఏనుగు తంటాలు.. నీళ్ల క్యాన్లు మోస్తున్న యువకుడు చూడడంతో.. చివరకు..
ABN, Publish Date - Apr 16 , 2024 | 05:32 PM
సాటి మనుషుల పట్ల కనీసం జాలి కూడా చూపించని ప్రస్తుత సమాజంలో కొంతమంది ప్రవర్తించే తీరు చూస్తే మానవత్వం ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తుంటుంది. చాలా మంది తోటి మనుషుల పట్లే కాకుండా జంతువుల పట్ల కూడా జాలి చూపిస్తుంటారు. ఇలాంటి
సాటి మనుషుల పట్ల కనీసం జాలి కూడా చూపించని ప్రస్తుత సమాజంలో కొంతమంది ప్రవర్తించే తీరు చూస్తే మానవత్వం ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తుంటుంది. చాలా మంది తోటి మనుషుల పట్లే కాకుండా జంతువుల పట్ల కూడా జాలి చూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఎండల వేడికి ఓ ఏనుగు దాహంతో విలవిలాడిపోయింది. దీన్ని గమనించిన క్యాన్లు మోసే వ్యక్తి చివరకు ఏం చేశాడో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో (Madhya Pradesh, Indore) ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిట్ట మధ్యాహ్నం వేళ ఓ ఏనుగు రోడ్డుపై నడుస్తూ వస్తోంది. అయితే ఎండల వేడికి అప్పటికే తీవ్ర దాహంతో ఉన్న ఏనుగు (thirsty elephant) ఓ చోట నిలబడి నీటి కోసం అటూ ఇటూ చూడసాగింది. అదే సమయంలో అక్కడ ఆటోలో నీళ్ల క్యాన్లు దించుతున్న ఓ యువకుడు ఏనుగు పరిస్థితిని గమనిస్తాడు. ఏనుగు ఎంతో దాహంతో ఉందన్న విషయం తెలుసుకుని.. నీళ్ల క్యాన్ (water can) తీసుకుని పరుగెత్తుకుంటూ ఏనుగు వద్దకు వెళ్తాడు.
Viral Video: ఈ చింపాంజీ తెలివి మామూలుగా లేదుగా.. వంగి నీళ్లు తాగడానికి బద్ధకమేసి.. ఏం చేసిందంటే..
చిన్న పిల్లల తరహాలో ఏనుగుకూ దగ్గరుండి నీళ్లు తాపుతాడు. క్యాన్‌ను వంచి నేరుగా ఏనుగు తొండంలో నీళ్లు పోసేస్తాడు. ఇలా మొత్తం రెండు క్యాన్ల నీటిని తాగి ఏనుగు తన దాహం తీర్చుకుంటుంది. ఏనుగు సమస్యను గమనించి, మానవత్వంతో దాహం తీర్చిన యువకుడిని అంతా అభినందిస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు’’.. అంటూ కొందరు, ‘‘మీరు చాలా గ్రేట్ బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Puzzle: ఈ చిత్రంలో దాక్కున్న ప్లాస్టిక్ స్ట్రాను కనుక్కోగలరేమో ప్రయత్నించండి..
Updated Date - Apr 16 , 2024 | 05:33 PM