Australian Open : స్టార్లు సులువుగా..
ABN , Publish Date - Jan 20 , 2024 | 01:05 AM
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుక్రవారం పురుషులు, మహిళల సింగిల్స్ విభాగాల్లో స్టార్లంతా సునాయాస విజయాలతో ప్రీక్వార్టర్స్‌కు చేరారు. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగు సెట్లపాటు శ్రమకోర్చిన టాప్ సీడ్ జొకోవిక్ మూడో

ప్రీక్వార్టర్స్‌లో జొకో, సబలెంకా, గాఫ్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుక్రవారం పురుషులు, మహిళల సింగిల్స్ విభాగాల్లో స్టార్లంతా సునాయాస విజయాలతో ప్రీక్వార్టర్స్‌కు చేరారు. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగు సెట్లపాటు శ్రమకోర్చిన టాప్ సీడ్ జొకోవిక్ మూడో రౌండ్‌లో 6-3, 6-3, 7-6 (2)తో మార్నిట్ ఎచివెరీపై అలవోకగా నెగ్గాడు. మిగతా సీడెడ్ ఆటగాళ్లలో రుబ్లేవ్ 6-2, 7-6 (6), 6-4తో కోర్డాపై, సిన్నర్ 6-0, 6-1, 6-3తో సెబాస్టియన్‌పై, సిట్సిపాస్ 6-3, 6-0, 6-4తో లుకా వాన్‌పై, డిమినార్ 6-3, 6-3, 6-1తో కొబోలీపైౖ గెలిచి నాలుగో రౌండ్ చేరారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో డిఫెండింగ్ చాంప్ సబలెంకా 6-0, 6-0తో సురెంకోను, నాలుగో సీడ్ కొకొ గాఫ్ 6-0, 6-2తో అలీసియాను చిత్తుచేయగా, 9వ సీడ్ క్రెజికోవా 4-6, 7-5, 6-4తో హంటర్‌పై, ఆండ్రీవా 1-6, 6-1, 7-6 (5)తో డిన్‌పారీపై నెగ్గి రౌండ్-16లో ప్రవేశించారు. గత రౌండ్‌లో వోజ్నియాకికి షాకిచ్చిన రష్యన్ స్టార్ మరియా తొమఫీవా మూడోరౌండ్‌లో 7-6 (7), 6-3తో పదోసీడ్ మయాను ఓడించింది.
మూడోరౌండ్‌కు బోపన్న జోడీ
భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న డబుల్స్‌లో తన జోరు కొనసాగిస్తున్నాడు. బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 6-2, 6-4తో స్థానిక ద్వయం జాన్ మిల్‌మన్/ఎడ్వర్డ్ వింటర్‌పై విజయంతో మూడోరౌండ్‌లో అడుగుపెట్టింది. ఇక భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీ/విక్టర్ వ్లాడ్ (రొమేనియా) జంట 6-3, 6-4తో ఇటలీ ద్వయం మాటియో/ఆండ్రియాను ఓడించి రెండోరౌండ్ చేరింది.