Christmas 2024: కూతురితో కలసి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఈ టీమిండియా స్టార్‌ను గుర్తుపట్టారా..
ABN, Publish Date - Dec 25 , 2024 | 06:16 PM
Christmas 2024: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సంబురాలు మిన్నంటాయి. యేసు క్రీస్తు జననానికి గుర్తుగా ఈ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చిలతో పాటు ఇళ్లను లైట్లతో అలంకరించుకుంటున్నారు. తమ కోరికలను నెరవేర్చాలని యేసును కోరుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సంబురాలు మిన్నంటాయి. యేసు క్రీస్తు జననానికి గుర్తుగా ఈ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చిలతో పాటు ఇళ్లను లైట్లతో అలంకరించుకుంటున్నారు. తమ కోరికలను నెరవేర్చాలని యేసును కోరుకుంటున్నారు. కరోల్స్ పాడటమే గాక క్రిస్మస్ చెట్లను కూడా అలంకరిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు సెలబెట్రీలు కూడా పండుగ సంబురాల్లో మునిగిపోయారు. కొందరు సెలెబ్రిటీలు క్రిస్మస్ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ టీమిండియా స్టార్ సంబురాల ఫొటోలు పంచుకున్నాడు. అతడు ఎవరు? ఎలా సెలబ్రేట్ చేశాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
సడన్ సర్‌ప్రైజ్..
భారత దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రిస్మస్ పండుగను వైభవంగా జరుపుకున్నాడు. భార్య సాక్షితో పాటు కూతురు జివాతో కలసి ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. శాంటాక్లాజ్‌గా మారిన ధోని.. అందుకు తగ్గట్లు కాస్టూమ్స్ మార్చేశాడు. తెల్లటి గుబురు గడ్డం, నెత్తిన టోపీ, కళ్లద్దాలు, చేతి నిండా బహుమతులతో అచ్చం క్రిస్మస్ తాతను తలపించాడు. అతడ్ని ఆ ఔట్‌ఫిట్‌లో గుర్తుపట్టడం కష్టేమే. శాంటాక్లాజ్‌లా మారిన మాహీని పట్టుకొని సతీమణి సాక్షి, కూతురు జీవా మురిసిపోయారు. అతడితో కలసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వీటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు ధోని.
కృతితో కలసి..
ధోని క్రిస్మస్ సంబురాల్లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్‌ను కూడా చూడొచ్చు. కృతి వైట్ అండ్ రెడ్ కలర్ డ్రెస్‌లో నెత్తిన క్యాప్‌తో మెరిసిపోయింది. మాహీ పక్కన ఫొటోలకు స్మైల్ ఇస్తూ పోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్.. ధోని క్రిస్మస్ వేడుకలు అదిరిపోయాయని అంటున్నారు. శాంటాక్లాజ్‌లా షాక్ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రిటైర్మెంట్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. మెగా ఆక్షన్, ఇంజ్యురీల నేపథ్యంలో వచ్చే సీజన్‌లో అతడు ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. అయితే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అతడ్ని చెన్నై సూపర్ కింగ్స్ రీటెయిన్ చేసుకోవడంతో మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా మారింది.
Also Read:
74 ఏళ్ల సంప్రదాయం.. బాక్సింగ్ డే టెస్ట్ ఎందుకంత స్పెషల్ అంటే..
బాక్సింగ్ డే టెస్ట్.. 2 కీలక మార్పులతో బరిలోకి రోహిత్ సేన
ఆసీస్ టీమ్‌లోకి జూనియర్ పాంటింగ్.. వీడు మామూలోడు కాదు
For More Sports And Telugu News
Updated Date - Dec 25 , 2024 | 06:16 PM