ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

WPL: రెండో సారి తుది మెట్టుపై బోల్తా.. కన్నీటిని ఆపుకోలేకపోయిన కెప్టెన్

ABN, Publish Date - Mar 18 , 2024 | 03:33 PM

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో సారి తుది మెట్టుపై బోల్తాపడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిన ఢిల్లీ మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్జుకుంది.

ఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో సారి తుది మెట్టుపై బోల్తాపడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిన ఢిల్లీ మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్జుకుంది. ఫైనల్ ఒత్తిడిని తట్టుకోలేక ఢిల్లీ జట్టు మరోసారి ఓడింది. ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీటి పర్యంతమైంది. కళ్లలో నుంచి వస్తున్న కన్నీటికి బయటికి కనిపించకుండా టవల్ అడ్డుపెట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెగ్ లానింగ్‌ను నెటిజన్లు ఓదారుస్తున్నారు. ఆమెకు మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కూడా లానింగ్‌కు మద్దతుగా నిలిచింది. కాగా గతేడాది కూడా మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన ఢిల్లీ రన్‌రఫ్‌తోనే సరిపెట్టుకుంది. గతేడాది, ఈ సంవత్సరం లీగ్ దశలో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ప్లేసులో నిలిచింది. కానీ ట్రోఫీ గెలవడంలో మాత్రం విఫలమైంది.


కాగా ఆదివారం ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ మొదటి 7 ఓవర్లలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 64 పరుగులు చేసింది. ఓపెనర్లు లానింగ్(23), షఫాలీ వర్మ(44) ఆ జట్టుకు శుభారంభం అందించారు. కానీ ఆ తర్వాత మిడిలార్డర్ వైఫల్యంతో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఆర్సీబీ స్పిన్నర్లను ఎదుర్కొలేక ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మ్యాచ్ జరుగుతున్నది తమ సొంత మైదానంలోనే అయినప్పటికీ ఢిల్లీ బ్యాటర్లు తేలిపోయారు. తర్వాతి 49 పరుగుల వ్యవధిలోనే 10 వికెట్లు కోల్పోయారు. మొత్తంగా 18.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 113 పరుగులకే ఢిల్లీ కుప్పకూలింది. అనంతరం బెంగళూరు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కాగా ఐపీఎల్‌తోపాటు డబ్ల్యూపీఎల్‌లో కలిపి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 03:43 PM

Advertising
Advertising