Hardik Pandya: ఒక్క నోటు హార్దిక్ జీవితాన్ని మార్చేసింది.. రూ.400 నుంచి వందల కోట్లకు..
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:52 PM
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పుల్ క్రేజ్, పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు అతడి పరిస్థితి వేరు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడతను.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పుల్ క్రేజ్, పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఏళ్లుగా భారత జట్టుకు ఆడుతూ భారీగా అభిమాన గణాన్ని పెంచుకున్నాడతను. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడుతూ మరింత మంది ఆడియెన్స్‌కు చేరువయ్యాడు. రెండు చేతులా సంపాదిస్తూ మంచి రేంజ్‌కు చేరుకున్నాడు. అతడి వార్షిక ఆదాయం భారీగా ఉంది. అటు భారత జట్టుతో పాటు ఇటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ పెద్ద మొత్తంలోనే వెనకేసుకుంటున్నాడు. యాడ్స్ రూపంలో ఏటా వందల కోట్లు ఆర్జిస్తున్నాడు. అయితే ఒక టైమ్‌లో అతడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాడట. కానీ ఒక్క నోటు అతడి జీవితాన్ని మార్చేసిందట.
దేవుడిలా ఆదుకున్నాడు
ఒక్క నోటు తన లైఫ్‌ను మార్చేసిందని అంటున్నాడు హార్దిక్ పాండ్యా. ఓ వ్యక్తి ఇచ్చిన రూ.400 నోటు వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని.. అతడికి ఎంతో రుణపడి ఉన్నానని చెప్పాడు. అతడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనని పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు లోకల్ టోర్నమెంట్స్‌లో ఆడేందుకు హార్దిక్ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఒక చోట మ్యాచ్ ఫీజ్ కట్టేందుకు రూ.400 అవసరం అయ్యాయి. అయితే డబ్బులు లేక నిరాశలో కూరుకుపోయాడు. సరిగ్గా ఆ సమయంలో ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి ఆదుకున్నాడని.. ఫీజు చెల్లించి తమను ఆడించాడని గుర్తుచేసుకున్నాడు పాండ్యా.
టర్నింగ్ పాయింట్
‘మ్యాచ్ ఫీజుకు డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తరుణంలో ఓ వ్యక్తి వచ్చి రూ.400 కట్టేసి మమ్మల్ని ఆడమని ప్రోత్సహించాడు. దీంతో నేను, కృనాల్ గ్రౌండ్‌లోకి దిగి అదరగొట్టాం’ అని ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ రివీల్ చేశాడు. ఆ వ్యక్తితో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటానని తెలిపాడు. అతడి రూ.400 తమకు ఎంతో పనికొచ్చాయని పేర్కొన్నాడు. ఆ టోర్నీలో కృనాల్ రూ.500 ప్రైజ్‌మనీ గెలుచుకొన్నాడని వ్యాఖ్యానించాడు హార్దిక్. ఇది తెలిసిన నెటిజన్స్.. లైఫ్‌లో గడ్డు పరిస్థితులే అన్నీ నేర్పిస్తాయని అంటున్నారు. ఆ సిచ్యువేషన్ చూశారు కాబట్టే ఇద్దరు అన్నదమ్ములు కష్టపడి ఆడుతూ ఈ స్థాయికి చేరుకున్నారని చెబుతున్నారు.
Also Read:
ఒక్క నోటు హార్దిక్ జీవితాన్ని మార్చేసింది.. రూ.400 నుంచి వందల కోట్లకు..
డౌటే లేదు.. కోహ్లీనే కెప్టెన్.. అశ్విన్ ఇలా అనేశాడేంటి
దిగొచ్చిన పాకిస్థాన్.. బీసీసీఐ దగ్గర తోకజాడిస్తే ఇలాగే ఉంటుంది
For More Sports And Telugu News
Updated Date - Nov 30 , 2024 | 06:02 PM