ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs NZ: ముంబై టెస్ట్‌లో భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు

ABN, Publish Date - Nov 03 , 2024 | 03:42 PM

IND vs NZ: అభిమానుల అంచనాలు తలకిందులు అయ్యాయి. మూడో టెస్ట్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకుంటుందంటే అది సాధ్యం కాలేదు. హ్యాట్రిక్ ఓటములతో కివీస్ చేతిలో రోహిత్ సేన వైట్‌వాష్ అయింది.

IND vs NZ: అభిమానుల అంచనాలు తలకిందులు అయ్యాయి. మూడో టెస్ట్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకుంటుందంటే అది సాధ్యం కాలేదు. హ్యాట్రిక్ ఓటములతో కివీస్ చేతిలో రోహిత్ సేన వైట్‌వాష్ అయింది. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో మన జట్టు 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటికే సిరీస్‌లోని రెండు మ్యాచుల్లో ఓడిన మెన్ ఇన్ బ్లూ.. చివరి టెస్ట్‌లోనూ ఓడి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరుత్సాహ పర్చింది. సొంతగడ్డపై పులుల్లా ఆడే మనోళ్లు న్యూజిలాండ్ ముందు తలవంచారు. అసలు మూడో టెస్ట్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


బ్యాటింగ్

ఈ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌ను బ్యాటింగ్ ఫెయిల్యూర్ తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. మూడో టెస్ట్‌లోనూ అదే జట్టు కొంపముంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యారు. స్పిన్ ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడటంతో ప్రత్యర్థి ఆటగాళ్లు అదే అస్త్రాన్ని ప్రయోగించి మనోళ్లతో ఆడుకున్నారు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీతో పాటు ఇతర బ్యాటర్లు అతడికే వికెట్లను అప్పగించారు.


విరాట్ కోహ్లీ

భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముక లాంటి కోహ్లీ మూడో టెస్ట్‌లోనూ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనైనా చెలరేగి టీమ్‌కు ఓదార్పు విజయాన్ని అందిస్తాడని అనుకుంటే అది జరగలేదు. టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎంతో కీలకమైన కోహ్లీ ఫెయిల్యూర్ జట్టుకు శాపంగా మారింది. జట్టు భారీ స్కోర్లు సాధించాలంటే మిడిలార్డర్‌లో కింగ్ బాగా ఆడటం ఎంతో ముఖ్యం. కానీ కోహ్లీ స్పిన్ వీక్‌నెస్‌తో రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 1 పరుగు చేశాడు. డబుల్ డిజిట్ కూడా దాటలేదు. ఇది జట్టు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. కోహ్లీ రన్స్ చేయకపోయినా క్రీజులో ఉంటే అవతలి ఎండ్‌లో బ్యాటర్లు మరింత కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేసేవారు. కానీ బాధ్యత తీసుకొని ఆడాల్సిన కింగ్.. ఆ పని చేయకపోవడం మైనస్‌గా మారింది. అతడు గనుక పట్టుదలతో ఆడి ఉంటే మ్యాచ్‌లో రిజల్ట్ మరోలా ఉండేది.


రోహిత్ శర్మ

కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కూడా భారత్ ఓటమికి ఒక కారణంగా చెప్పొచ్చు. బౌలింగ్ టైమ్‌లో సారథిగా అతడు చేసిన ఫీల్డింగ్ మార్పులు, బౌలింగ్ ఛేంజెస్ బాగున్నాయి. కానీ బ్యాటింగ్‌లో అతడు ఫెయిల్ అవడం మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసింది. హిట్‌మ్యాన్ ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడినా లెక్క వేరేలా ఉండేది. కానీ అది జరగలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 29 పరుగులే చేశాడు. క్విక్ స్టార్ట్ లభించినా దాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. అదే సమయంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో అవసరాన్ని బట్టి ఆటగాళ్లను వాడుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తొలి రోజు ముగిసే సమయంలో అశ్విన్ బదులు సిరాజ్‌ను నైట్‌ వాచ్‌మన్‌గా పంపాడు. అతడు ఔట్ అవడంతో టీమ్ మీద మరింత ప్రెజర్ పడింది. ఇలా హిట్‌మ్యాన్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు సరిగ్గా వర్కౌట్ కాలేదు. దీంతో పాటు జట్టు బ్యాటర్లు స్పిన్‌ను సరిగ్గా ఎదుర్కోకపోవడం, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేకపోవడం, ఫియర్‌లెస్ అప్రోచ్‌తో ముందుకెళ్లకపోవడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారాయని చెప్పొచ్చు.


Also Read:

కంటతడి పెట్టిస్తోంది.. రిటెయిన్ లిస్ట్‌లో పేరు లేకపోవడంపై కోల్‌కతా స్టార్ ప్లేయర్ భావోద్వేగం

మ్యాచ్‌ను తిప్పేశారు

సుధీర్‌ డబుల్‌

For More Sports And Telugu News

Updated Date - Nov 03 , 2024 | 03:46 PM