Share News

T20 WC Final: టాస్ గెలిచిన భారత జట్టు.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN , Publish Date - Jun 29 , 2024 | 07:40 PM

టీ20 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్ పోరు ప్రారంభమైంది. టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడేందుకు రంగంలోకి దిగాయి. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత జట్టు టాస్ గెలిచి..

T20 WC Final: టాస్ గెలిచిన భారత జట్టు.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
T20 World Cup Final Match

టీ20 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్ పోరు ప్రారంభమైంది. టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడేందుకు రంగంలోకి దిగాయి. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో.. భారీ స్కోరు చేసేందుకు ఆస్కారం ఉంది కాబట్టి, కెప్టెన్ రోహిత్ శర్మ తెలివిగా ఆలోచించి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా.

సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, అన్రిచ్ నోకియా, తబ్రెజ్ షంసి.

Updated Date - Jun 29 , 2024 | 07:44 PM