ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌ ఎఫెక్ట్.. బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..!

ABN, Publish Date - Mar 27 , 2024 | 02:10 PM

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ లవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరిగే మ్యా్చ్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎగబడుతున్నారు. హైదరాబాద్‌లోని(Hyderabad) ఉప్పల్(Uppal) వేదికగా జరుగనున్న..

IPL 2024 CSK vs SRH

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్(IPL 2024) ఫీవర్ క్రికెట్ లవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరిగే మ్యా్చ్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎగబడుతున్నారు. హైదరాబాద్‌లోని(Hyderabad) ఉప్పల్(Uppal) వేదికగా జరుగనున్న ఈ మ్యా్చ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఏప్రిల్ 5వ తేదీన జరుగనున్న ఈ మ్యాచ్ టికెట్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసింది పేటీఎం. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు పేటీఎం చూపిస్తోంది.

అయితే, కేవలం రూ. 15 వేలు, రూ. 22 వేలు, రూ. 30 వేల టికెట్లను మాత్రమే అమ్మకానికి పెట్టింది పేటీఎం. 1500, 4,000, 4500, 6,000, 7,500 రూపాయల టికెట్లన్నీ సోల్డ్ ఔట్‌గా పెట్టింది పేటీఎం. పేటీఎం తరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. గంటలోపే వేల టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఓపెన్ అయ్యే గంట ముందు నుంచే ఆన్‌లైన్‌లో ఎదురు చూస్తున్నామని.. ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే టికెట్స్ బుక్ అవలేదని క్రికెట్ ఫ్యా్న్స్ ఆరోపిస్తున్నారు. ఆ కాసేపటికే సోల్డ్ అవుట్ అని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్స్‌ని బ్లాక్‌లో విక్రయిస్తున్నారని క్రికెట్ లవర్స్ ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ టికెట్ల పక్కదారి పడుతున్నాయంటున్నారు. కొందరు కేటుగాళ్లు బ్లా్క్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు చెబుతున్నారు. రూ. 15,00 టికెట్‌ను రూ. 5,000 గా, రూ. 4వేల టికెట్‌ను రూ. 9 వేలుగా, రూ. 6 వేల టికెట్ రూ. 12 వేలు చొప్పున బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 02:10 PM

Advertising
Advertising