Big Breaking: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. సీఎస్‌కే కొత్త కెప్టెన్ ఎవరంటే..
ABN, Publish Date - Mar 21 , 2024 | 04:22 PM
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ టీమ్(Indian Cricket Team) నుంచి తప్పుకున్న ధోనీ.. తాజాగా ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్సీని కూడా వదిలేసుకున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ..
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ టీమ్(Indian Cricket Team) నుంచి తప్పుకున్న ధోనీ.. తాజాగా ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్సీని కూడా వదిలేసుకున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. ఈ సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తన స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా నియామకం అయ్యాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 5 టైటిల్స్ గెలిచింది. ఈ దఫా కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ధోనీనే సారథ్యం వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాడు. దాంతో సీఎస్‌కే యాజమాన్యం టీమ్‌కు కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను నియమించింది.
‘ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. తన కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. రుతురాజ్ గైక్వాడ్ 2019 నుంచి సీఎస్‌కే టీమ్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే టీమ్ తరఫున 52 మ్యాచ్‌లు ఆడాడు. అద్భుతంగా రాణించాడుక. త్వరలో జరుగబోయే మ్యాచ్‌ల కోసం టీమ్‌కు గైక్వాడ్ సారథ్యం వహిస్తాడు’ అని సీఎస్‌కే యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అధిక వయస్సు, గాయాలు..
జులైలో ఎంఎస్ ధోనీకి 43 ఏళ్లు దాటనున్నాయి. అధిక వయస్సు కారణం, కాలి గాయం కారణంగా ధోనీ అసలు ఆడుతాడా? ఆడడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో ధోనీ చెపాక్ స్టేడియం చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 5 ఐపీఎల్ టైటిల్స్‌ను కొట్టింది. ముంబై ఇండియన్స్ రికార్డ్‌ను సమం చేసింది. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో మోకాలి గాయంతో బాధపడుతూనే మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. ఆ తరువాత ముంబైలో ఆస్పత్రిలో చేరి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. తిరిగి కోలుకున్న ధోనీ.. ఈ సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
కాగా, 2022లోనూ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఎంఎస్ ప్లేస్‌లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించారు. అయితే, ఆ సీజన్‌లో సీఎస్‌కే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. వరుస ఓటముల పాలై.. ట్రోఫీకి దూరమైంది. దీంతో జడేజా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. సీఎస్‌కే యాజమాన్యం మళ్లీ ధోనీకే టీమ్ పగ్గాలను అప్పగించింది. ఇప్పుడు కూడా ధోనీ తప్పుకున్నాడు. మరి గైక్వాడ్ సారథ్యంలో సీఎస్‌కే టీమ్ కప్పు కొడుతుందా? లేదా? అనేది చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 21 , 2024 | 04:50 PM