IPL 2024: ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్లు వీళ్లే!
ABN, Publish Date - Mar 23 , 2024 | 03:14 PM
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మ్యాచ్‌లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.
చండీగఢ్: ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మ్యాచ్‌లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తమ విదేశీ ప్లేయర్లుగా బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, కర్రాన్, రబాడను తుది జట్టులోకి తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే హోప్, మార్ష్, వార్నర్, స్టబ్స్‌ను తుది జట్టులో ఆడిస్తోంది. రెండు జట్ల గత హెడ్ టూ హెడ్ రికార్డులు సమంగా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 32 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్‌ల్లో ఢిల్లీ, 16 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలిచాయి. ఈ మ్యాచ్‌తో స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఏడాది కాలం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. 30 డిసెంబర్ 2022న జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో మ్యాచ్‌లో అందరి చూపు రిషబ్ పంత్ మీదనే ఉండనుంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా పంతే వ్యవహరించనున్నాడు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్
Updated Date - Mar 23 , 2024 | 03:18 PM