IPL 2025 Mega Auction: ఆ కుర్రాడి కోసం ముంబై-కేకేఆర్ కొట్లాట.. జాక్‌పాట్ కొట్టేశాడు
ABN , Publish Date - Nov 25 , 2024 | 05:29 PM
IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో తోపు ప్లేయర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోతున్నారు. చిచ్చరపిడుగుల్లాంటి ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోతున్నారు. అయితే ఓ కుర్రాడు మాత్రం జాక్‌పాట్ కొట్టేశాడు.
జెడ్డా: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో తోపు ప్లేయర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోతున్నారు. చిచ్చరపిడుగుల్లాంటి ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోతున్నారు. అయితే ఓ కుర్రాడు మాత్రం జాక్‌పాట్ కొట్టేశాడు. అతడే అల్లా ఘజన్‌ఫర్. ఈ ఆఫ్ఘానిస్థాన్ యంగ్ స్పిన్నర్‌ను రూ.4.80 కోట్ల ధరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో వేలం బరిలోకి దిగినా అన్‌సోల్డ్‌గా మిగిలాడు ఘజన్‌ఫర్. అలాంటోడ్ని ముంబై పోటీపడి తీసుకోవడానికి అతడి పెర్ఫార్మెన్స్ ఒక కారణమైతే.. మరో కారణం ఆర్సీబీ, కేకేఆర్ ఫ్రాంచైజీలు అనే చెప్పాలి.
పెరుగుతూ పోయిన బిడ్
ఘజన్‌ఫర్ కోసం పెద్దగా పోటీ ఉంటుందని ఎవరూ అనుకోలేదు. కానీ అతడు ఏకంగా రూ.4.80 కోట్లు కొల్లగొట్టి ఆశ్చర్యపరిచాడు. అజింక్యా రహానె, శార్దూల్ ఠాకూర్, కేన్ విలియమ్సన్ లాంటి స్టార్లు అన్‌సోల్డ్‌గా ఉన్నారు. అందుకే ఈ యంగ్ స్పిన్నర్ చాలా తక్కువ ధరకు అమ్ముడుపోవచ్చని.. లేదా అన్‌సోల్డ్‌గా మిగిలిపోతాడని అనుకున్నారు. కానీ అతడి పెర్ఫార్మెన్స్, మ్యాచులను టర్న్ చేసే సత్తాను గమనించిన ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. తక్కువ ధర పలికే ఛాన్స్ ఉన్నా.. ఆర్సీబీ, కేకేఆర్ బిడ్‌ను పెంచాయి. దీంతో ముంబై ఎలాగైనా దక్కించుకోవాలని డిసైడ్ అయింది. పెద్దగా క్రేజ్ లేని ఓ కుర్రాడు, అందునా లీగ్‌కు కొత్తోడు కావడం.. అయినా ఈ ధర పలకడం అంటే ఘజన్‌ఫర్‌కు జాక్‌పాట్ తగిలిందని నెటిజన్స్ అంటున్నారు.
ఒక్క మ్యాచ్‌తో వెలుగులోకి..
ఇటీవల బంగ్లాదేశ్‌తో షార్జా వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో అల్లా ఘజన్‌ఫర్ చెలరేగిపోయాడు. 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ఆ టీమ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇప్పటిదాకా 16 టీ20ల్లో 29 వికెట్లు తీసిన ఈ 18 ఏళ్ల స్పిన్నర్.. గత ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టుతో ట్రావెల్ చేశాడు. మరో ఆఫ్ఘాన్ క్రికెటర్ ముజీబుర్ రెహ్మాన్‌కు రీప్లేస్‌మెంట్‌గా కోల్‌కతా జట్టులోకి వచ్చాడు. అయినా ఆడే అవకాశం దక్కించుకోలేదు. అయితే ఈ మధ్య కాలంలో అతడు సూపర్బ్‌గా బౌలింగ్ చేస్తుండటంతో తీసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అందుకే భారీ ధర ధక్కించుకున్నాడు.
Also Read:
తక్కువ ధరకే మొనగాడ్ని పట్టేసిన ముంబై.. రోహిత్‌తో ఓపెనింగ్
పేరుకు తోపులు.. ఒక్కరూ అమ్ముడుపోలేదు
చిత్తుగా ఓడినా ఆసీస్ పొగరు తగ్గలేదు.. వీళ్లకు రోహితే కరెక్ట్ మొగుడు
For More Sports And Telugu News