Share News

T20 World Cup: భారత్- కెనడా మ్యాచ్ రద్దవుతుందా.. ఫ్లోరిడాలో వాతావరణం ఎలా ఉందంటే..!

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:26 PM

అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికే ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు కాగా.. మూడో మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

T20 World Cup: భారత్- కెనడా మ్యాచ్ రద్దవుతుందా.. ఫ్లోరిడాలో వాతావరణం ఎలా ఉందంటే..!
INDIA VS CAN

అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికే ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు కాగా.. మూడో మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా ఇవాళ భారత్ తన చివరి మ్యాచ్ కెనడాతో ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్లోరిడాలో వర్షం పడటంతో మ్యాచ్ నిర్వహించేందుకు అనుకూల వాతావరణం లేనట్లు తెలుస్తోంది. దీంతో భారత్-కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యే ఛాన్సెస్ ఎక్కువుగా ఉన్నాయంటున్నారు క్రికెట్ నిపుణులు. గత కొద్ది రోజులుగా ఫ్లోరిడాలో మ్యాచ్‌ల నిర్వహణకు వాతావరణం అనుకూలంగా లేదు. ఫ్లోరిడాలో ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీలంక- నేపాల్, అమెరికా- ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇవాళ జరగాల్సిన ఇండియా, కెనడా మ్యాచ్‌కు వరుణుడు అడ్డంగా మారే సూచనలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.


ప్రతికూల వాతావరణం

ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరగాల్సిన భారత్-కెనడా మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం నెలకొంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేదానిపై మరో రెండు గంటలో క్లారిటీ రానుంది.

Neet: నీటుకు చేటు


వాతావరణం ఎలా ఉందంటే..

వాతావరణ కేంద్రం అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఫ్లోరిడాలో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. రోజంతా బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.


వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైతే..

ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో అమెరికా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. కెనడాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. టీమిండియాపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ భారత్‌కు, కెనడాకు చెరొక పాయింట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 05:26 PM