Virat Kohli: కోహ్లీతో బీ కేర్‌ఫుల్.. దినేష్ కార్తీక్ వార్నింగ్..
ABN, Publish Date - Dec 25 , 2024 | 07:53 PM
Boxing Day Test: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీని మినహాయిస్తే అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. అసలు కింగ్ బ్యాట్ ఎందుకు మూగబోయిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.
IND vs AUS: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీని మినహాయిస్తే అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. అసలు కింగ్ బ్యాట్ ఎందుకు మూగబోతోందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆసీస్ టూరే కాదు.. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అతడు విఫలమయ్యాడు. గత మూడ్నాలుగేళ్లలో వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్నా.. లాంగ్ ఫార్మాట్‌లో మాత్రం అతడు అంచనాలను అందుకోవడం లేదు. ఫ్యాబ్-4లోని జో రూట్, కేన్ విలియమ్సన్ టెస్టుల్లో వరుస సెంచరీలతో విజృంభిస్తుంటే.. కోహ్లీ మాత్రం రేసులో వెనుకబడిపోయాడు. దీంతో అతడిపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో బీ కేర్‌ఫుల్ అని హెచ్చరించాడు. కార్తీక్ ఇంకా ఏమన్నాడంటే..
కఠినమైన దశ
కోహ్లీని తక్కువ అంచనా వేయొద్దని.. అతడు ఊచకోత కోస్తాడని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు. విరాట్ ఫామ్‌లో లేడనేది వాస్తవమేనని.. కానీ అతడు ఒక్కసారిగా లయను అందుకుంటే తగ్గేదేలే అంటూ దూసుకెళ్తాడని అన్నాడు. ఆఫ్ స్టంప్‌కు అవతల పడే బంతులతో అతడు ఇబ్బంది పడుతున్నాడని, కానీ త్వరలోనే ఇందులో నుంచి బయటపడతాడని ఆశిస్తున్నానని తెలిపాడు కార్తీక్. ఇది కోహ్లీ కెరీర్‌లో చాలా కఠినమైన దశ అని అభిప్రాయపడ్డాడు. కానీ అతడో ఫైటర్ అని.. పోరాడటం ఎప్పుడూ ఆపడని చెప్పుకొచ్చాడు.
పోరాటం ఆపడు
‘కోహ్లీ ఓ యోధుడు. అతడు పోరాటం ఆపడు. గబ్బా టెస్ట్‌లో ఔట్ అయ్యాక అతడు అక్కడే ఆగిపోలేదు. నిరాశతో కూర్చోలేదు. వెంటనే నెట్స్‌లోకి వెళ్లి తీవ్రంగా సాధన చేశాడు. రిథమ్‌ను అందుకునేందుకు ప్రయత్నించాడు. ఓటమిని ఒప్పుకోవడం, వైఫల్యాలకు భయపడి వెనుకంజ వేయడం కోహ్లీ తత్వం కాదు. అతడు ఫైట్ చేస్తూనే ఉంటాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కోసం అతడు పరితపిస్తూ ఉంటాడు’ అని కార్తీక్ వ్యాఖ్యానించాడు. ఫోర్త్ స్టంప్ సమస్యను అతడు కచ్చితంగా దాటుతాడని.. నాలుగో టెస్ట్‌లో పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు డీకే. అతడి ఊచకోత ఏంటో మున్ముందు చూస్తామంటూ అభిమానుల్లో ఆశలు నింపాడు.
Also Read:
చరిత్ర సృష్టించిన బుమ్రా.. అశ్విన్ సరసన పేసుగుర్రం
కూతురితో కలసి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఈ టీమిండియా స్టార్‌ను
74 ఏళ్ల సంప్రదాయం.. బాక్సింగ్ డే టెస్ట్ ఎందుకంత స్పెషల్ అంటే..
బాక్సింగ్ డే టెస్ట్.. 2 కీలక మార్పులతో బరిలోకి రోహిత్ సేన
For More Sports And Telugu News
Updated Date - Dec 25 , 2024 | 07:53 PM