Chris Gayle: తెలంగాణ జట్టు కెప్టెన్‌గా యూనివర్సల్ బాస్.. గ్రౌండ్‌లోకి దిగేది ఎప్పటి నుంచంటే..
ABN , First Publish Date - 2024-02-10T12:19:10+05:30 IST
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. అది కూడా మన తెలుగు జట్టు అయినా తెలంగాణ టైగర్స్ తరఫున కావడం విశేషం. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 మధ్య జరిగే ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టు తరఫున క్రిస్ గేల్ బరిలోకి దిగనున్నాడు.
హైదరాబాద్: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. అది కూడా మన తెలుగు జట్టు అయినా తెలంగాణ టైగర్స్ తరఫున కావడం విశేషం. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 మధ్య జరిగే ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టు తరఫున క్రిస్ గేల్ బరిలోకి దిగనున్నాడు. తెలంగాణ టైగర్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. తెలంగాణ టైగర్స్ జట్టులో క్రిస్ గేల్‌తోపాటు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పావెల్, భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగి, మన్‌ప్రీత్ గోని కూడా ఉన్నారు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రిస్ గేల్ పేరు మీదనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గేల్ మాట్లాడుతూ టోర్నీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.
‘‘ఈ యూనివర్సల్ బాస్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లతో కలిసి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మొదటి వెటరన్ ప్రీమియర్ లీగ్‌తో మీ ముందుకురాబోతున్నాడు. ఐవీపీఎల్ కోసం సిద్ధంగా ఉండండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్’’ అని చెప్పాడు. కాగా బోర్డ్ ఫర్ వెటరన్ క్రికెట్ ఇన్ ఇండియా (BVCI) ఈ ఐవీపీఎల్ టోర్నీని నిర్వహించనుంది. బీవీసీఐ ప్రెసిడెంట్, ఐవీపీఎల్ చైర్మన్ ప్రవీణ్ త్యాగి మాట్లాడుతూ “మేము ఐపీఎల్ తర్వాత భారతదేశంలోని అత్యుత్తమ లీగ్‌ల్లో దీనిని ఒకటిగా సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము ఈ లీగ్‌లో క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లను ఆడిస్తున్నాం.’’ అని అన్నాడు. క్రిస్ గేల్‌తోపాటు వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేష్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసుఫ్ పఠాన్, హర్షల్ గిబ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. మొత్తం 6 జట్లు పాల్గొంటున్న ఈ ఐవీపీఎల్ టోర్నీలో తెలంగాణ టైగర్స్‌తోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ ఉన్నాయి. ప్రతి జట్టులో నలుగురు నుంచి ఐదుగురు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఉండనున్నారు. మొత్తంగా ఈ టోర్నీ ద్వారా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆటగను చూసే అవకాశం అభిమానులకు మరోసారి దక్కిందనే చెప్పుకోవాలి. తన టీ20 కెరీర్‌లో ఎన్ని రికార్డులను అందుకున్న గేల్ మరోసారి తన బ్యాట్ ఝుళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.