IPL 2024: హ్యాట్రిక్ సిక్సులు బాదిన ధోని.. అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం
ABN, Publish Date - Apr 15 , 2024 | 03:36 PM
ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్‌లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024కు ( IPL 2024) మంచి ఊపు వచ్చింది. బ్యాటింగ్ పిచ్‌లే తయారు చేయడంతో ఏ జట్టు స్కోరు అయినా సరే 200 వరకు చేస్తోంది. ఆ తర్వాత కొన్ని జట్లు ఛేజ్ చేస్తున్నాయి. మరికొన్ని చతికిల బడుతున్నాయి. ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్‌లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు. ఆ 20 పరుగులే జట్టుకు కలిసి వచ్చాయి. చెన్నై జట్టు 20 ముంబైపై పరుగుల తేడాతో విజయం సాధించింది.
Hardik Pandya: చెత్త కెప్టెన్సీ.. చెత్త బౌలింగ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణ ట్రోలింగ్!
4 బంతుల్లో 20 పరుగులు
ధోని క్రీజులోకి వచ్చే సరికి జట్టు స్కోరు 186 పరుగులు ఉన్నాయి. చివరి ఓవర్‌లో 20 రన్స్ చేశాడు. అందులో మూడు సిక్స్‌లు వరసగా బాదాడు. దాంతో ధోని స్ట్రైక్ రేట్ 500 శాతంగా ఉంది. ఒవర్ లాంగ్ ఆన్‌లో ఒకటి, ఒవర్ లాంగ్ ఆఫ్‌లో మరొకటి, స్వ్కేర్ లెగ్‌లో మరొ సిక్స్ కొట్టాడు. ధోని సిక్సులు కొట్టడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అభిమానులు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. ముంబై, చెన్నై జట్లు చెరో ఐదుసార్లు కప్ కొట్టాయి. అయినప్పటికీ అభిమానులు పట్టించుకోలేదు. స్టేడియం నీలిరంగు మయం అయ్యింది. ధోని సిక్సర్లు కొడితే దాదాపు అందరూ ఎంజాయ్ చేశారు.
IPL 2024: నేడు RCB vs SRH కీలక మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే
309 బాల్స్‌లో 756 రన్స్
ఐపీఎల్ కెరీర్‌లో ధోని 20వ ఓవర్‌లో 309 బాల్స్ ఎదుర్కొన్నాడు. ఆ బంతుల్లో 756 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 244.66గా ఉంది. ఇందులో 51 ఫోర్లు, 64 సిక్సులు ఉన్నాయి. ఈ సీజన్‌లో ధోని 12 బంతులను ఎదుర్కొన్నాడు. 41 పరుగులు చేశాడు. 341.66గా స్ట్రైక్ రేట్ ఉంది. సీజన్‌లో నాలుగు ఇన్సింగ్సుల్లో 59 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. ధోని 256 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 5 వేల 141 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 136.58గా ఉంది. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 84 పరుగులు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం
Updated Date - Apr 15 , 2024 | 03:36 PM