Share News

ఆశలన్నీ చోప్రాపైనే!

ABN , Publish Date - Aug 08 , 2024 | 05:31 AM

సెమీ్‌సలో హాకీ జట్టు ఓటమి.. వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటుతో.. కోట్లాది మంది భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నది ఒక్కడివైపు.. అతడే బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా. గురువారం మధ్య రాత్రి జరిగే జావెలిన్‌ త్రో ఫైనల్లో చోప్రా ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగనున్నాడు. జావెలిన్‌ త్రో డిఫెండింగ్‌ చాంప్‌గా పోటీల్లోకి అడుగుపెట్టిన చోప్రా..

ఆశలన్నీ  చోప్రాపైనే!

నేడే జావెలిన్‌ త్రో ఫైనల్‌ రాత్రి 11.55 నుంచి

పారిస్‌: సెమీ్‌సలో హాకీ జట్టు ఓటమి.. వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటుతో.. కోట్లాది మంది భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నది ఒక్కడివైపు.. అతడే బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా. గురువారం మధ్య రాత్రి జరిగే జావెలిన్‌ త్రో ఫైనల్లో చోప్రా ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగనున్నాడు. జావెలిన్‌ త్రో డిఫెండింగ్‌ చాంప్‌గా పోటీల్లోకి అడుగుపెట్టిన చోప్రా.. క్వాలిఫయర్స్‌లో ఒకే ఒక్క త్రో నేరుగా ఫైనల్‌కు చేరి సత్తాచాటాడు. 84 మీటర్లు ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌ మార్క్‌గా నిర్ణయించగా.. నీరజ్‌ తొలి త్రోలోనే 89.34 మీటర్లు విసిరాడు. ఫైనల్‌ చేరుకొన్న 12 మందిలో చోప్రాదే టాప్‌ త్రో. అయితే, పతక పోరులో జాకబ్‌ వాల్డెజ్‌ (చెక్‌), అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), జూలియన్‌ వెబర్‌ (జర్మనీ), అర్షద్‌ నదీమ్‌ (పాక్‌) నుంచి నీరజ్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. గత క్రీడల్లో స్వర్ణం గెలిచిన చోప్రా.. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించాడు. ఆ తర్వాత డైమండ్‌ లీగ్‌ చాంప్‌గా నిలిచి.. నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకొన్నాడు. మరోసారి అతడు దేశానికి పసిడి అందించగలడనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే జరిగితే ఒలింపిక్స్‌ చరిత్రలో జావెలిన్‌ త్రో టైటిల్‌ నిలబెట్టుకొన్న ఐదో ఆటగాడిగా.. రెండు ఒలింపిక్‌ స్వర్ణాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాడు.

Updated Date - Aug 08 , 2024 | 05:31 AM