Share News

కష్టాలు దాటుకొని..

ABN , Publish Date - Feb 24 , 2024 | 04:11 AM

బుమ్రా గైర్హాజరీలో జట్టులోకి సర్రున దూసుకొచ్చిన ఆకాశ్‌ దీప్‌.. అరంగేట్ర టెస్టులోనే మూడు వికెట్లతో సత్తా చాటి టీమిండియా నయా పేస్‌ సంచలనంగా మారాడు.

కష్టాలు దాటుకొని..

బుమ్రా గైర్హాజరీలో జట్టులోకి సర్రున దూసుకొచ్చిన ఆకాశ్‌ దీప్‌.. అరంగేట్ర టెస్టులోనే మూడు వికెట్లతో సత్తా చాటి టీమిండియా నయా పేస్‌ సంచలనంగా మారాడు. ఆర్ధికంగా కష్టాలు, కుటుంబంలో వరుస విషాదాలతో మూడేళ్లు ఆటకు దూరమైన ఇతడు.. మళ్లీ బంతి పట్టి రంజీలు, ఆ తర్వాత ఐపీఎల్‌, ఇప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. బిహార్‌లోని బడ్డీ గ్రామానికి చెందిన ఆకాశ్‌ తండ్రి రామ్‌జీ సింగ్‌ ప్రభుత్వ పాఠశాల టీచర్‌. చదువుపైనే దృష్టి పెట్టాలంటూ నాన్న ఎంత నచ్చజెప్పినా, తనకిష్టమైన క్రికెట్‌పైనే ఆసక్తి కనబరిచిన ఆకాశ్‌ బంధువు సహకారంతో స్థానిక అకాడమీలో చేరి ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. కానీ, కుటుంబంలో జరిగిన వరుష విషాద ఘటనలతో మూడేళ్లపాటు ఆకాశ్‌ బంతి పట్టలేకపోయాడు. 2015లో నాన్న రామ్‌జీ పక్షవాతానికి గురై మరణించాడు. రెండునెలల తర్వాత అన్న ధీరజ్‌ కూడా అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో మానసికంగా ఆకాశ్‌ ఎంతగానో కుంగిపోయాడు. ఇదే సమయంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో.. ఆదాయం కోసం ఇసుక రీచ్‌ల వద్ద ట్రక్కులు అద్దెకిచ్చే వ్యాపారం చేశాడు. ఇలా మూడేళ్లు గడిచిన తర్వాత మళ్లీ క్రికెట్‌పై దృష్టి సారించిన ఆకాశ్‌.. యునైటెడ్‌ క్రికెట్‌ క్లబ్‌ (యూసీసీ) ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్‌ అండర్‌-23 జట్టులో, అనంతరం రంజీల్లో మెరుగైన ప్రదర్శన చేసి ఐపీఎ ల్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో బెంగళూరు, పంజాబ్‌ జట్ల తరఫున ప్రతిభ చాటుకున్న 2022లో ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రంజీల్లో నిలకడైన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఆడాలన్న తన కలను సాకారం చేసుకున్నాడు.

Updated Date - Feb 24 , 2024 | 04:11 AM