CERT - In: ప్రభుత్వ హెచ్చరిక.. ఐఫోన్, మ్యాక్‌బుక్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోండి!
ABN , Publish Date - Nov 26 , 2024 | 05:07 PM
ఐఫోన్, మ్యాక్‌బుక్ వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఈ డివైజెస్ వినియోగించే వాళ్లు తక్షణం తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్నీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ - ఐఎన్) సూచన జారీ చేసింది. ఆయా ఉత్పత్తుల్లోని ఓఎస్‌లో కొన్ని కోడ్స్ కారణంగా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్, మ్యాక్‌బుక్ వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఈ డివైజెస్ వినియోగించే వాళ్లు తక్షణం తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్నీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ - ఐఎన్) సూచన జారీ చేసింది. ఆయా ఉత్పత్తుల్లోని ఓఎస్‌లో కొన్ని కోడ్స్ కారణంగా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హ్యాకటర్లు ఈ బలహీన కోడ్స్‌ను ఉపయోగించి అనుమతి లేకుండానే డివైజెస్‌కు యాక్సెస్ పొంది, సమాచార చోరీతో పాటు మొత్తం డివైజ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉందంటూ ఓ ప్రకటన విడుదల చేసింది (Technology).
Pixel Laptop: త్వరలో పిక్సెల్ లాప్‌టాప్ లాంచ్ చేయనున్న గూగుల్?
సీఈఆర్‌టీ - ఐఎన్ ప్రకటన ప్రకారం, ఐఓఎస్ 18.1.1, ఐప్యాడ్ ఓఎస్ 17.7.2 కంటే ముందు వర్షెన్స్ ఉన్న ఐఫోన్, ఐప్యాడ్స్; మ్యాక్‌ఓఎస్ సెకోయియా 15.1.1 కంటే ముందు వర్షన్స్ ఉన్న మ్యాక్‌బుక్స్, డెస్క్‌టాప్స్; విజన్ ఓఎస్ 2.1.1 కంటే ముందు వర్షెన్స్ ఉన్న విజన్ ప్రో; 18.1.1 కంటే ముందటి సఫారీ బ్రౌజర్సు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. వీటిల్లోని జావాస్క్రిప్ట్ కోర్, వెబ్‌కిట్‌లోని కోడ్స్‌లో కొన్ని బలహీనతలు ఉన్నాయని, వీటిని వినియోగించి హ్యాకర్లు వ్యక్తులనే కాకుండా సంస్థలను కూడా హ్యాక్ చేయొచ్చని హెచ్చరించింది.
WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..
ఈ బలహీనతల సాయంతో హ్యాకర్లు వ్యక్తుల లేదా సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాస్‌వర్డ్స్, ఆర్థిక సమాచారం, ఇతర గోప్యమైన బిజినెస్ ఫైల్స్ చోరీ చేయొచ్చని హెచ్చరించారు.
ఈ వల్నరబిలిటీస్ ఉన్న డివైజెస్‌లోని డాటాను తస్కరించడం లేదా మార్పులు చేసే ప్రమాదం ఉంది
వీటి సాయంతో సైబర్ నేరగాళ్లు మొత్తం డివైజెస్ క్రాష్ అయ్యేలా చేసి సాధారణ కార్యకలాపాలు స్తంభించిపోయేలా చేయొచ్చు
చివరిగా ఈ కోడ్స్ సాయంతో మొత్తం డివైజ్‌ను తమ నియంత్రణలోకి తీసుకుని మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడం, యూజర్ కార్యకలాపాలపై నిఘా పెట్టడం వంటివి చేయొచ్చు.
ఈ బలహీనతలు చాలా ప్రమాదమైనవని, సైబర్ నేరగాళ్లు ఇప్పటికే వీటిని దుర్వినియోగపరిచి ఉండొచ్చని కూడా సీఈఆర్‌టీ - ఐఎన్ హెచ్చరించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా వినియోగదారులు వెంటనే తమ డివైజ్ సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. తమ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సెట్టింగ్స్ ఆప్షన్‌లోని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేస్తే డివైజ్ వెంటనే అప్‌డేట్ అవుతుంది.
For More Technology News and Telugu News