ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌’లో 2 బోగీలకు మంటలు..

ABN, Publish Date - Jun 21 , 2024 | 03:47 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్‌ సైడ్‌ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.

  • వాషింగ్‌ సైడ్‌ వద్ద కొత్త రైలు నిలిపి ఉంచగా ప్రమాదం..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్‌ సైడ్‌ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. 15 బోగీలతో కూడిన ఈ రైలు శుక్రవారం ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే దీన్ని 15 రోజుల క్రితం వాషింగ్‌ యార్డులో నిలిపారు. ఏమైందో తెలియదు గానీ.. గురువారం ఉదయం 11.15 గంటల సమయంలో ఆ రైలు వంట గదులున్న (ప్యాంట్రీ) చివరి రెండు బోగీలకు మంటలంటుకున్నాయి.


దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాక సిబ్బందికి సమాచారమిచ్చారు. మంటలు వ్యాపిస్తుండటంతో రైల్వే సిబ్బంది మిగతా బోగీలతో ఆ రెండు బోగీలను వేరు చేశారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కష్టపడి మంటలను అదుపు చేశారు.

Updated Date - Jun 21 , 2024 | 03:47 AM

Advertising
Advertising