ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పీహెచ్‌సీలకు కొత్తగా 435 మంది వైద్యులు!

ABN, Publish Date - Jun 29 , 2024 | 03:14 AM

కాంగ్రెస్‌ హయాంలో మెడికల్‌ బోర్డు నుంచి తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రజారోగ్య విభాగంలో 435 మంది వైద్యుల భర్తీకి వైద్య నియామక బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

  • పోస్టుల భర్తీకి మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌

  • 2 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ హయాంలో మెడికల్‌ బోర్డు నుంచి తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రజారోగ్య విభాగంలో 435 మంది వైద్యుల భర్తీకి వైద్య నియామక బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు జూలై 2 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 11 సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు. ఈ పోస్టులన్నింటికీ ఎంబీబీఎ్‌సను అర్హతగా నిర్ణయించారు. అలాగే అభ్యర్థులు కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో నమోదు చేసుకొని ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే వారు అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసేందుకు అనర్హులని నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నారు.


ఇక అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులకు ఎంబీబీఎ్‌సలో వచ్చిన మార్కులు, కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేవారికి ఇచ్చే మార్కుల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. మొత్తం వంద పాయింట్లు ఉంటాయి. ఇందులో వైద్యవిద్యలో వచ్చిన మార్కులకు 80 పాయింట్లు, వెయిటేజీగా 20 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల్లో మల్టీ జోన్‌ 1లో 271, మల్టీ జోన్‌ 2లో 164 పోస్టులున్నాయి. వీటిలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ విభాగంలో నాలుగు పోస్టులున్నాయి. వివరాలకు ఠీఠీఠీ.ఝజిటటఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ ను సందర్శించవచ్చు.

Updated Date - Jun 29 , 2024 | 03:14 AM

Advertising
Advertising