ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 63% ఉత్తీర్ణత!

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:14 AM

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుర్రా వెంకటేశం సోమవారం విడుదల చేశారు. ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63 శాతం, రెండో ఏడాదిలో 43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

  • 29 వరకు రీకౌంటింగ్‌

  • దరఖాస్తుల స్వీకరణ

ములుగు,హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుర్రా వెంకటేశం సోమవారం విడుదల చేశారు. ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63 శాతం, రెండో ఏడాదిలో 43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,54,498 మంది రెగ్యులర్‌, 18,913 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 1,62,520 మంది రెగ్యులర్‌(63.86ు), 10,070 మంది ఒకేషనల్‌(53.24ు) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే 1,38,477 మంది రెగ్యులర్‌, 15,136 మంది ఒకేషనల్‌ విద్యార్థులు రెండో ఏడాది పరీక్షలు రాశారు.


వీరిలో 60,615 మంది రెగ్యులర్‌ (43.77ు) విద్యార్థులు, 7,737 మంది ఒకేషనల్‌ (51.12ు) విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించారు. అయితే ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ములుగు జిల్లా మొదటి సంవత్సరంలో 85.29 శాతం, రెండో సంవత్సరంలో 81.49 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానం సాధించింది. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు ఈనెల 25 నుంచి 29వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Updated Date - Jun 25 , 2024 | 03:14 AM

Advertising
Advertising