ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aadhaar: ఆధార్‌ నెట్‌వర్క్‌లో లోపాలు.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

ABN, Publish Date - Jul 12 , 2024 | 03:49 AM

ఆధార్‌ ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌లో లోపాలతో.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో భూములు/స్థిరాస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి.

  • ఆయా కార్యాలయాల వద్ద వినియోగదారుల పడిగాపులు

హైదరాబాద్‌/ఘట్‌కేసర్‌/చేవెళ్ల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆధార్‌ ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌లో లోపాలతో.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో భూములు/స్థిరాస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి. యూఐడీఏఐ నెట్‌వర్క్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా.. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నా.. బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ లేకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఆధార్‌ ఆధారిత ఓటీపీ సేవలు నిలిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందని.. తహసీల్దార్‌, సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారని వివరించారు.


ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఇరువైపులా(అమ్మకం/కొనుగోలుదారులు, సాక్ష్యులు) పది మంది వరకు ఉంటారు. వీరంతా ఆధార్‌ బయోమెట్రిక్‌ పనిచేయక.. రోజంతా పడిగాపులుకాచారని పేర్కొన్నారు. కాగా.. రోజుకు సగటున ఏడు వేలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఆధార్‌ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యల కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిచిపోయాయని స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్‌ వెల్లడించారు. గురువారం నిలిచిపోయిన సేవలను శుక్రవారానికి రీషెడ్యూల్‌ చేసినట్లు తెలిపారు.


ఆరు రోజులుగా నిలిచిన ట్యాక్స్‌ వసూళ్లు

మునిసిపాలిటీల్లో ఆరు రోజులుగా వివిధ రకాల ట్యాక్స్‌ల వసూళ్లు నిలిచిపోయాయి. వివిధ రకాల పన్నుల వసూళ్లకు ఉపయోగించే పోస్‌ యంత్రాలు పనిచేయకపోవడమే ఇందుకు కారణమని అధికారులు వివరించారు. సాఫ్ట్‌వేర్‌ లోపాలతో ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు.

Updated Date - Jul 12 , 2024 | 03:49 AM

Advertising
Advertising
<