ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Formula-E: హెచ్‌ఎండీఏ అధికారుల్లో గుబులు

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:06 AM

ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ దర్యాప్తు.. ఓఆర్‌ఆర్‌ను ప్రైవేటుకు అప్పగించడంపై సిట్‌ ఏర్పాటుతో హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అధికార వర్గాల్లో పరేషాన్‌ మొదలైంది.

  • ఒకవైపు ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ దర్యాప్తు

  • మరోవైపు ఔటర్‌ రింగ్‌రోడ్డుపై సిట్‌ విచారణ

  • సంబంధిత విభాగాల అధికారుల్లో హైరానా!

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ దర్యాప్తు.. ఓఆర్‌ఆర్‌ను ప్రైవేటుకు అప్పగించడంపై సిట్‌ ఏర్పాటుతో హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అధికార వర్గాల్లో పరేషాన్‌ మొదలైంది. ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ.. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ (ఏ2), ఇంజనీరింగ్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి (ఏ3) పేర్లను చేర్చింది. దీంట్లో ఇంకా ఎవరెవరి పేర్లు చేర్చుతారనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు విచారణకు వీరినే పిలుస్తారా? లేక రేస్‌ నిర్వహణలో భాగమైన ఇతర అధికారులను కూడా పిలుస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బును బదిలీ చేయడంలో హెచ్‌ఎండీఏ అకౌంట్‌ విభాగం కూడా కీలకంగా పని చేసిన నేపథ్యంలో.. అందులోని సీఏవో, ఏవో, డీఏవోలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తాము కూడా దర్యాప్తునకు హాజరవ్వాల్సి ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు.


ఇక.. ఔటర్‌ రింగ్‌ రోడ్డును ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లకు లీజుకివ్వడంపై సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం రేవంత్‌ ప్రకటించడంతో హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. సిట్‌ విచారణకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌తో పాటు హెచ్‌జీసీఎల్‌లోని అప్పటి ఎండీ, ప్రాజెక్టు డైరెక్టర్‌, సీజీఎం, డీజీఎం హాజరయ్యే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి టెండర్‌ టెక్నికల్‌ బిడ్‌ పరిశీలన, అనుమతిలో పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఐదుగురు చీఫ్‌ ఇంజనీర్లు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. టెండర్‌ ప్రైస్‌ బిడ్‌ను.. అప్పటి మునిసిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఫైనాన్స్‌ కార్యదర్శి ఇలా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీయే ఖరారు చేసి ‘ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా’ను ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరంతా సిట్‌ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది త్వరలో తెలిసే అవకాశాలున్నాయి.

Updated Date - Dec 21 , 2024 | 04:06 AM