ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Seethakka: జనవరి 26 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లిలో పర్యటిస్తారు

ABN, Publish Date - Jan 08 , 2024 | 08:31 PM

జనవరి 26వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ఇంద్రవెల్లిలో పర్యటిస్తారని మంత్రి సీతక్క ( Minister Seethakka ) తెలిపారు. సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRD‌లో సీఎం రేవంత్ చర్చించారు.

హైదరాబాద్: జనవరి 26వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ఇంద్రవెల్లిలో పర్యటిస్తారని మంత్రి సీతక్క ( Minister Seethakka ) తెలిపారు. సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRD‌లో సీఎం రేవంత్ చర్చించారు. మొదటగా ఆదిలాబాద్ పార్లమెంట్‌ స్థానంపై చర్చించారు. ఈ సమావేశంపై మీడియాకు మంత్రి సీతక్క ( Minister Seethakka ) వివరాలలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద రేవంత్‌కు ప్రేమ ఉందన్నారు.మొదటి పర్యటనగా ఇంద్రవెల్లికి ముఖ్యమంత్రి వస్తామని తెలిపారని మంత్రి సీతక్క చెప్పారు.

ఆ విషయం బీఆర్ఎస్ నేతలకు నచ్చడం లేదా

గత పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. మిగతా ప్రాంతాలకు దీటుగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారని తెలిపారు. గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు నియోజక వర్గాల వారీగా అభివృద్ధి ఎజెండా ప్రిపేర్ చేసుకోవాలని రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దుర్మార్గపు ఆలోచనలు మానాలని హితవు పలికారు. ప్రభుత్వాలు కూల్చడం, కాల్చడం మీద అంత శ్రద్ధ ఎందుకని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు పదవులు లేకపోయే సరికి తట్టుకోలేక పోతున్నారని సెటైర్లు వేశారు. ఆటో కార్మికులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చ గొడుతోన్నారని మండిపడ్డారు. మహిళలు ఫ్రీ గా బస్సులల్లో ప్రయాణం చేయడం బీఆర్ఎస్ నేతలకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు. మహిళలకు 2500 రూపాయలు, గ్యాస్ 500, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ మలి విడతలో అమలు చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Updated Date - Jan 08 , 2024 | 08:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising