ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

U.S. Education: విదేశీ విద్యకు ఫెలోషిప్‌: తుమ్మల

ABN, Publish Date - Aug 04 , 2024 | 03:53 AM

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే వ్యవసాయ విద్య విద్యార్థులకు వ్యవసాయ శాఖ ఫెలోషి్‌పను అందించనుంది.

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే వ్యవసాయ విద్య విద్యార్థులకు వ్యవసాయ శాఖ ఫెలోషి్‌పను అందించనుంది. ఏడాదికి నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఒక్కొక్కరికీ రూ.55.50 లక్షల చొప్పున మొత్తం రూ.2.22 కోట్లను అందించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈమేరకు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫెలోషిప్‌ సాధించిన నలుగురు విద్యార్థులతో ఆయన శనివారం సచివాలయంలో మాట్లాడారు.


ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయం నుంచి 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ చదివిన, చదువుతోన్న విద్యార్థులు అమెరికాలోని ఆబర్న్‌ యూనివర్శిటీ, అలబామా స్టేట్‌ యూనివర్శిటీలలో మాస్టర్స్‌ చేసేందుకు ఒక్కో వ్యవసాయ యూనివర్శిటీ నుంచి ఇద్దరు చొప్పున నలుగురిని పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు.


తమ ప్రభుత్వం పేద విద్యార్థులతో పాటు ఆయా రంగాల్లో ప్రతిభ చూపుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫెలోషి్‌పకు ఎంపికైన నలుగురు విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రఘునందన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2024 | 03:53 AM

Advertising
Advertising
<