Khammam Lok Sabha Seat:: ఖర్గేతో తుమ్మల భేటీ
ABN, Publish Date - Apr 22 , 2024 | 07:56 PM
ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
ఖమ్మం, ఏప్రిల్ 22: ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
LokSabha Elections: పెమ్మసాని ఆస్తులు.. ఆసక్తికర చర్చ
ఈ సందర్బంగా తన మనస్సులోని మాటను.. ఖర్గే వద్ద ఉంచినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిని నిలిపే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఏఐసీసీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఈ సందర్బంగా ఖర్గే వద్ద ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే పార్టీ బరిలో నిలిపే అభ్యర్థి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్బంగా ఏఐసీసీ అధ్యక్షుడికి తుమ్మల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు
మరోవైపు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. అయితే లోక్‌సభ ఎన్నికల వేళ.. ఖమ్మం ఎంపీ సీటు హాట్ సీట్‌గా మారింది. ఈ సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందిని బరిలో దింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
West Bengal: ఉపాధ్యాయులు భర్తీ స్కాం.. మమత ప్రభుత్వానికి గట్టి దెబ్బ
ఇంకోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సైతం.. ఈ స్థానం నుంచి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డిని పోటీ చేయించేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇక మరో మంత్రి తమ్ముల నాగేశ్వరరావు కూడా ఇదే స్థానం నుంచి తన కుమారుడుని పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు ఉమ్మడి ఖమ్మం జిల్లా వారే కావడం విశేషం.
Tamilnadu: కట్టుదిట్ట భద్రత నడుమ ఈవీఎం, వీవీప్యాడ్‌లు
దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. అయితే ఎన్నికల సమీపించాయి. ఈ నేపథ్యంలో వీరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్లితే మంచిదనే అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తుంది. అందులోభాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రంగంలోకి దిగి అభ్యర్థి ఎవరనే విషయంపై ఓ స్పష్టత ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.
Read Latest National News and Telugu News
Updated Date - Apr 22 , 2024 | 07:59 PM