ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: హెచ్‌ఎండీఏ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే..!

ABN, Publish Date - Jun 10 , 2024 | 06:02 AM

బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్‌ బంక్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్‌ ఏర్పాటు.. వీటీల్లో దేనికైనాసరే హెచ్‌ఎండీఏ ఇకపై ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేయనుంది. కొన్ని అనుమతులు ఆన్‌లైన్‌లో మరికొన్ని అనుమతులు ఆఫ్‌లైన్‌లో జారీ చేసే గత విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది.

  • ఎన్ని అంతస్తుల భవనమైనా, లేఅవుట్‌ అయినా సరే

  • టీజీ బీపా్‌సలో భారీగా మార్పులు

  • ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు స్వస్తి

  • డీపీఎంఎస్‌ విధానానికి ముగింపు

  • అనుమతుల జారీలో పెరగనున్న వేగం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌9 (ఆంధ్రజ్యోతి): బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్‌ బంక్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్‌ ఏర్పాటు.. వీటీల్లో దేనికైనాసరే హెచ్‌ఎండీఏ ఇకపై ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేయనుంది. కొన్ని అనుమతులు ఆన్‌లైన్‌లో మరికొన్ని అనుమతులు ఆఫ్‌లైన్‌లో జారీ చేసే గత విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది. భవన నిర్మాణ, లేఅవుట్‌ తదితర అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునే తెలంగాణ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ సిస్టమ్‌ (టీజీబీపా్‌స)లో ఇందుకోసం భారీగా మార్పులు చేసింది. టీజీబీపా్‌స(గతంలో టీఎ్‌సబీపా్‌స)లోని సాంకేతిక సమస్యలను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులకు సంబంధించి అనేక దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో స్వీకరించేవారు. ఫలితంగా అనుమతుల జారీ అంశంలో అనేక తప్పిదాలు, అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో టీజీబీపా్‌సలోని ఆయా లోపాలను సరిచేశారు. గతంలో కొన్ని రకాల దరఖాస్తులను మాత్రమే స్వీకరించే విధంగా ఉన్న టీజీబీపా్‌సను అన్ని రకాల దరఖాస్తులు స్వీకరించి అనుమతుల జారీ చేసే విధంగా సిద్ధం చేశారు. దీంతో హెచ్‌ఎండీఏ అనుమతుల్లో పారదర్శకత పెరగడంతోపాటు అనుమతుల జారీలో జాప్యం కూడా తగ్గనుంది.


డీపీఎంఎస్‌ బంద్‌ !

భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు దేశంలోనే తొలిసారిగా హెచ్‌ఎండీఏలో పదేళ్ల క్రితం డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎ్‌స)ను తీసుకొచ్చారు. అనుమతుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు డీపీఎంఎస్‌ ఆధారంగా అభివృద్ధి చేసిన టీజీబీపా్‌సను మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. అయితే, ఐదు నుంచి 58 అంతస్తుల భవన నిర్మాణం, లేఅవుట్ల, గోడౌన్లు, పెట్రోల్‌ బంక్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల అనుమతి కోసం హెచ్‌ఎండీఏకు వచ్చే దరఖాస్తులకు మాత్రం టీజీబీపాస్‌ సహకరించలేదు. దీంతో ఆయా దరఖాస్తులను తిరిగి డీపీఎంఎ్‌సలో తీసుకునేవారు. ఆపై, పాత విధానమైన డీపీఎంఎస్‌లో ఉన్న లోపాలు, టీజీబీపా్‌సలో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల స్వీకరణను ఆఫ్‌లైన్‌ విధానంలోకి మార్చారు. దీని వల్ల ఎదురైన సమస్యలను పరిగణనలోకి తీసుకున్న మున్సిపల్‌ శాఖ టీజీబీపా్‌సను పూర్తిగా అప్‌డేట్‌ చేసింది. అన్ని అనుమతులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకుని, అనుమతి పొందే విధంగా చర్యలు తీసుకుంది. టీజీబీపా్‌సను ఏప్రిల్‌ 24 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని, అనుమతుల జారీ ప్రక్రియ వేగవంతమైందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు తెలిపారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 06:02 AM

Advertising
Advertising